మగవాళ్లకూ సంతాన నిరోధక మాత్రలు.. అతి త్వరలోనే మార్కెట్లోకి..!

జనాభా పెరుగుతున్న దేశాలకు ఇది నిజంగా గుడ్ న్యూసే. ఇప్పటివరకు ఆడవాళ్ళకు మాత్రమే గర్భనిరోధక మాత్రలు ఉండగా అతి త్వరలోనే మగవాళ్ళకు కూడా సంతాన నిరోధక మాత్రలు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ కుదిరితే వీలైనంత త్వరగా ఈ మాత్రలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవాంఛిత ప్రెగ్నెన్సీని అడ్డుకోవడం కోసం ఆడవాళ్లకు గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారు. ఈ మాత్రలు అండాల తయారీని అడ్డుకుని గర్భం రాకుండా చూస్తాయి. కేవలం శారీరక సుఖం కోరుకునే జంటలు, పెళ్లయినప్పటికీ […]

Advertisement
Update:2021-08-05 07:46 IST

జనాభా పెరుగుతున్న దేశాలకు ఇది నిజంగా గుడ్ న్యూసే. ఇప్పటివరకు ఆడవాళ్ళకు మాత్రమే గర్భనిరోధక మాత్రలు ఉండగా అతి త్వరలోనే మగవాళ్ళకు కూడా సంతాన నిరోధక మాత్రలు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ కుదిరితే వీలైనంత త్వరగా ఈ మాత్రలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవాంఛిత ప్రెగ్నెన్సీని అడ్డుకోవడం కోసం ఆడవాళ్లకు గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారు. ఈ మాత్రలు అండాల తయారీని అడ్డుకుని గర్భం రాకుండా చూస్తాయి.

కేవలం శారీరక సుఖం కోరుకునే జంటలు, పెళ్లయినప్పటికీ ప్రెగ్నెన్సీ ని వాయిదా వేసే దంపతులు, అనుకోకుండా గర్భం దాల్చి దాన్ని తొలగించు కోవాలనుకునేవారు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. పిల్లల్ని కనడాన్ని వాయిదా వేయడం, సురక్షిత శృంగారం కోసం కొన్నేళ్ల కిందట కండోమ్ లను అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అయితే సంతానాన్ని నిరోధించే మాత్రలు మాత్రం పురుషులకు చాలా ఏళ్లయినా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఆ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.

పురుషుల సంతాన నిరోధక మాత్రలను యూనివర్సిటీ ఆఫ్ డుండీ (స్కాట్లాండ్ ) తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించి కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా.. ప్రస్తుతం ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది. ఈ మాత్రల తయారీకి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. బిల్ గేట్స్ సహకారం ఉండడంతో మగవాళ్ళ సంతాన నిరోధక మాత్రల తయారీ ప్రక్రియ వేగంగా నడుస్తోంది. ఇప్పటికే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ డుండీ వర్సిటీకి 1.7 మిలియన్ డాలర్ల సాయం కూడా అందించింది.

ఆడవాళ్ళలో అండాల తయారీని గర్భ నిరోధక మాత్రలు ఎలా అయితే అడ్డుకుంటాయో అలాగే పురుషుల సంతాన నిరోధక మాత్రలు మగవాళ్లలో వీర్యకణాల తయారీని అడ్డుకొని సంతానం కలగకుండా చూస్తాయి. ఈ మాత్రలను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తయారు చేస్తున్నట్లు డుండీ వర్సిటీ రిప్రొడక్టివ్ మెడిసిన్ ప్రొఫెసర్ క్రిస్ బర్రాత్ తెలిపాడు. ఈ మాత్రలు మార్కెట్లోకి వస్తే పేద దేశాల్లో జనాభా పెరుగుదల కు అడ్డుకట్ట పడుతుందని ఆయన చెబుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News