ఒలింపిక్స్‌లో మనోళ్ల ఆట ఎలా ఉందంటే..

ఒలింపిక్స్‌లో భారత్ దూసుకుపోతుంది. ఎక్స్‌పెక్ట్ చేసిన సెగ్మెంట్స్‌లో నిరాశ పరచకుండా నిలకడగా రాణిస్తున్నారు భారత ఆటగాళ్లు. భారత షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మరోపక్క భారత హాకీ జట్టు కూడా విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో మనోళ్ల పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే.. దూసుకెళ్తున్న హాకీ టీం హాకీలో టీమిండియా క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో ఎట్టకేలకు విజయం సాధించింది. ఇదే స్పీడ్ […]

Advertisement
Update:2021-07-29 09:25 IST

ఒలింపిక్స్‌లో భారత్ దూసుకుపోతుంది. ఎక్స్‌పెక్ట్ చేసిన సెగ్మెంట్స్‌లో నిరాశ పరచకుండా నిలకడగా రాణిస్తున్నారు భారత ఆటగాళ్లు. భారత షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మరోపక్క భారత హాకీ జట్టు కూడా విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో మనోళ్ల పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే..

దూసుకెళ్తున్న హాకీ టీం
హాకీలో టీమిండియా క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో ఎట్టకేలకు విజయం సాధించింది. ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే.. సెమీస్ ఇంకా ఫైనల్స్ లో దుమ్ము దులిపే అవకాశం ఉంది.

సింధుపైనే ఆశలు
రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధు టోక్యోలో కూడా అదే స్పీడ్‌తో దూసుకుపోతోంది. ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌ను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. క్వార్టర్స్ , సెమీస్‌లో కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ రెండు స్టెప్స్ దాటితే.. ఫైనల్‌కు చేరుకోవచ్చు. ఫైనల్స్‌కు చేరుకుంటే ఏదో ఒక పతకం ఖాయమనే చెప్పొచ్చు.

ఆకట్టుకుంటున్న అతాను
పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో భారత ప్లేయర్ అతానుదాస్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఎలిమినేషన్‌ పోరులో జరిగిన హోరాహోరీ పోరులో డెంగ్‌ యు చెంగ్‌ను 6-4 తేడాతో ఓడించాడు. ఆ తర్వాత లండన్‌ ఒలింపిక్‌ విజేత అయిన హో జిన్‌హెక్‌పై గట్టి పోటీ ఇచ్చి విజయాన్ని అందుకున్నాడు. అతాను గురి సరిగ్గా కుదిరితే ఈ సారి పతకం ఖాయం.

పంచ్ దూరంలో సతీశ్‌
91 కిలోల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించాడు. తర్వాత జరగబోయే క్వార్టర్‌ ఫైనల్లో ఉజ్‌బెకిస్థాన్‌ బాక్సర్‌ బాఖోదిర్‌ జలోలొవ్‌తో సతీశ్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి, సెమీస్ కు చేరుకుంటే ఏదో ఒక పతకం ఖాయం.

బోణీ కొట్టిన బాకర్
మహిళల 25 మీ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ మనూ బాకర్‌ బోణి చేసింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మంచి స్కోర్ కనబరిచి 292 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. రేపు జరగబోయే ర్యాపిడ్ పిస్టల్ పోటీల్లో రాణించగలిగితే బాకర్ నుంచి కూడా మంచి విజయాలు ఆశించొచ్చు.

Tags:    
Advertisement

Similar News