బ్రిటన్ లో పోస్ట్ కోవిడ్ క్లినిక్ లకు భలే డిమాండ్..

ఇప్పటి వరకూ కోవిడ్ పేరుతో జరిగిన వైద్యాన్ని, వైద్యం పేరుతో జరుగుతున్న వ్యాపారాన్నే చూశాం. ఇప్పుడు కోవిడ్ ట్రీట్ మెంట్ కంటే ఎక్కువగా పోస్ట్ కోవిడ్ ట్రీట్ మెంట్ పాపులర్ అవుతోంది. బ్రిటన్ లో పోస్ట్ కోవిడ్ క్లినిక్ లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. బ్రిటన్లోని 302 ఆస్పత్రుల్లో చేసిన ఓ సర్వేలో కోవిడ్ తర్వాత దాదాపుగా సగం మంది పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. వీరంతా మరోసారి ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. దీంతో అక్కడ కోవిడ్ […]

Advertisement
Update:2021-07-16 03:00 IST

ఇప్పటి వరకూ కోవిడ్ పేరుతో జరిగిన వైద్యాన్ని, వైద్యం పేరుతో జరుగుతున్న వ్యాపారాన్నే చూశాం. ఇప్పుడు కోవిడ్ ట్రీట్ మెంట్ కంటే ఎక్కువగా పోస్ట్ కోవిడ్ ట్రీట్ మెంట్ పాపులర్ అవుతోంది. బ్రిటన్ లో పోస్ట్ కోవిడ్ క్లినిక్ లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. బ్రిటన్లోని 302 ఆస్పత్రుల్లో చేసిన ఓ సర్వేలో కోవిడ్ తర్వాత దాదాపుగా సగం మంది పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. వీరంతా మరోసారి ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. దీంతో అక్కడ కోవిడ్ వార్డులతోపాటు, పోస్ట్ కోవిడ్ ట్రీట్ మెంట్ వార్డులు కూడా రెడీ అయ్యాయి. కోవిడ్ తగ్గిన తర్వాత వచ్చే సమస్యలకోసం ప్రత్యేకంగా అక్కడ క్లినిక్ లు ఏర్పడ్డాయి. ఊపిరి తిత్తులు, గుండె, లివర్ స్పెషలిస్ట్ లతోపాటు, మానసిక వ్యాధుల నిపుణులకు కూడా చేతినిండా పని దొరికినట్టయింది.

203 లక్షణాలు..
కోవిడ్ తగ్గిపోయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనేది తెలిసిన విషయమే. కోవిడ్ ట్రీట్ మెంట్ లో వాడిన స్టెరాయిడ్స్ వల్ల ముఖ్యంగా ఇలాంటి ఇతర సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్సే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారడం విశేషం. దాదాపుగా 203 రకాల ఇతర సమస్యలు కోవిడ్ తగ్గిపోయిన వారిలో గుర్తించారు బ్రిటన్ వైద్య నిపుణులు. అందులో 66 లక్షణాలు ఏడు నెలల వరకూ కొనసాగాయని తేలింది. బ్రెయిన్ ఫాగ్, టిన్నిటస్, మెంటల్ ఇంబాలెన్స్, నీరసం, దురద, లైంగిక బలహీనత.. వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఇలాంటి వాటి ట్రీట్ మెంట్ కోసం ఇప్పుడు అక్కడ కొత్తగా క్లినిక్ లు తెరుచుకుంటున్నాయి. దీన్నిప్పుడు దీర్ఘకాలిక కోవిడ్ గా అభివర్ణిస్తున్నారు.

పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఉద్యోగాలకు ఎసరు..
బ్రిటన్ లో చేపట్టిన సర్వేలో 22 శాతం మంది రోగులు కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత అంతకు ముందులాగా పూర్తి స్థాయిలో పని చేసుకోలేకపోతున్నామని తెలిపారు. ఆ కారణంగా తమ ఉద్యోగాలు కోల్పోయినట్టు, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నట్టు చెప్పారు. మరో 45 శాతం మంది తమకు అంతకు ముందులా పని చేయడం కుదరట్లేదని, అందుకే పని తగ్గించుకుంటున్నామని తెలిపారు.

మొత్తమ్మీద పోస్ట్ కోవిడ్ లేదా లాంగ్ కోవిడ్ సమస్యలు మరింత ఉధృతంగా మారుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సమస్యలున్నా.. ఇప్పుడు మొత్తంగా 203 లక్షణాలను పోస్ట్ కోవిడ్ సమస్యల జాబితాలో చేర్చడం ఆందోళన కలిగించే విషయం. భారత్ లో దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు కానీ, లేకపోతే.. ఇక్కడ కూడా పోస్ట్ కోవిడ్ క్లినిక్ లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ వార్డులతోపాటు, పోస్ట్ కోవిడ్ వార్డులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News