మూడో వేవ్ వచ్చేసింది.. రుజువులు ఇవే..

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్.. మనం ఇలా పేర్లు పెట్టుకుంటున్నాం కానీ, కొత్తగా ఎక్కడినుంచో ఈ వేవ్ లు వచ్చి మనల్ని తాకవు. మనకి మనమే, మన నిర్లక్ష్యం కారణంగానే కేసుల్లో పెరుగుదల నమోదవుతుంది. దీనికి మరో ఉదాహరణే థర్డ్ వేవ్. సెకండ్ వేవ్ ఉధృతం కావడానికి డెల్టా వేరియంట్ కారణం అని సరిపెట్టుకున్నా.. ఇప్పుడు మూడో వేవ్ ముప్పుకి మరో వేరియంట్ ని నిందించలేం. కేవలం ప్రజల నిర్లక్ష్యాన్ని మాత్రమే కారణంగా చెప్పగలం. […]

Advertisement
Update:2021-07-12 02:20 IST

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్.. మనం ఇలా పేర్లు పెట్టుకుంటున్నాం కానీ, కొత్తగా ఎక్కడినుంచో ఈ వేవ్ లు వచ్చి మనల్ని తాకవు. మనకి మనమే, మన నిర్లక్ష్యం కారణంగానే కేసుల్లో పెరుగుదల నమోదవుతుంది. దీనికి మరో ఉదాహరణే థర్డ్ వేవ్. సెకండ్ వేవ్ ఉధృతం కావడానికి డెల్టా వేరియంట్ కారణం అని సరిపెట్టుకున్నా.. ఇప్పుడు మూడో వేవ్ ముప్పుకి మరో వేరియంట్ ని నిందించలేం. కేవలం ప్రజల నిర్లక్ష్యాన్ని మాత్రమే కారణంగా చెప్పగలం.

అవును దేశంలో మూడోవేవ్ వచ్చేసిందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్య నిపుణులు. దీనికి సాక్ష్యంగా ‘R’ వేల్యూని పేర్కొంటున్నారు. రేట్‌ ఆఫ్‌ గ్రోత్‌ (R-నెంబర్‌)లో పెరుగుదల నమోదైందని, థర్డ్ వేవ్ ముప్పుకి ఇదే మొదలు అని తేల్చేశారు.

అసలేంటీ R-నెంబర్
అంటు వ్యాధులు ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని రేట్‌ ఆఫ్‌ గ్రోత్‌ ( R-నెంబర్)గా పేర్కొంటారు. R విలువ 0.88గా నమోదైందంటే 100 మంది కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల నుంచి వ్యాధి 88 మందికి సోకుతున్నట్టు అర్థం. ఆర్‌ విలువ 1 దాటిందంటే.. వ్యాధి వ్యాప్తిరేటు శరవేగంగా పుంజుకుందని గమనించాలి. ప్రస్తుతం కేరళలో R విలువ 1.1గా, మహారాష్ట్రలో R విలువ 1గా నమోదవుతోంది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న Rవేల్యూ..
దేశవ్యాప్తంగా మే 15 వ‌ర‌కు Rవేల్యూ 0.78 గా ఉండేది. అంటే క‌రోనా 100మంది నుంచి 78 మందికి సోకిందని అర్ధం. జూన్ చివ‌రి వ‌ర‌కు ఈ వేల్యూ క్ర‌మంగా తగ్గుతూ వ‌చ్చింది. దీంతో ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ వ‌చ్చారు. అయితే, జూన్ 26 వ తేదీ నుంచి ఈ వేల్యూ మ‌ళ్లీ పెరుగుతూ వస్తోంది. జూన్ 26న రేట్ ఆఫ్ గ్రోత్ వేల్యూ 0.88గా ఉన్న‌ట్టు చెన్నైలోని మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్ సంస్థ పరిశోధనలో తేలింది. ఈ R వేల్యూ 1కంటే పెరిగితే డెంజ‌ర్ అని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి, కేసుల సంఖ్య తగ్గడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు సడలించి నిబంధనలు పక్కనపెట్టేశారు. దీంతో జనం గుంపులు గుంపులుగా పోగవుతున్నారు, మాస్క్ లు పక్కనపెట్టేశారు, శానిటైజర్ల వాడకం మరచిపోయారు. పిల్లలకు స్కూల్స్ కూడా లేకపోవడంతో వారాంతాల్లో పిక్నిక్ లు, టూర్లతో సందడి చేస్తున్నారు. దీంతో మళ్లీ కరోనాకి మనం ఆహ్వానం పలికినట్టయింది. థర్డ్ వేవ్ రాకకి ఇదే కారణం అంటున్నారు నిపుణులు. కొత్త వేరియంట్ వచ్చి థర్డ్ వేవ్ లో కేసులు పెరుగుతాయనుకోవడం అమాయకత్వం అని, మన నిర్లక్ష్యంతోనే కేసులు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News