రాజశేఖర్​రెడ్డిని విమర్శించారో..? మర్యాద దక్కదు..!

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు తాజాగా మరోసారి తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్​, ఆయన తండ్రి దివంగత నేత రాజశేఖర్​రెడ్డిపై ఆరోపణలు చేశారు. మంత్రులు ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్ రాజశేఖర్​రెడ్డి నరరూప రాక్షసుడు అంటూ వ్యాఖ్యానించారు. అయితే టీఆర్​ఎస్​ కావాలనే ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తున్నదని.. హుజూరాబాద్​ ఉప ఎన్నిక ముందు.. రాజకీయ లబ్ధి పొందేందుకు వైషమ్యాలు రెచ్చగొడుతున్నదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జలాల […]

Advertisement
Update:2021-07-02 11:46 IST

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు తాజాగా మరోసారి తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్​, ఆయన తండ్రి దివంగత నేత రాజశేఖర్​రెడ్డిపై ఆరోపణలు చేశారు. మంత్రులు ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్ రాజశేఖర్​రెడ్డి నరరూప రాక్షసుడు అంటూ వ్యాఖ్యానించారు.

అయితే టీఆర్​ఎస్​ కావాలనే ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తున్నదని.. హుజూరాబాద్​ ఉప ఎన్నిక ముందు.. రాజకీయ లబ్ధి పొందేందుకు వైషమ్యాలు రెచ్చగొడుతున్నదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జలాల వివాదం, పోతిరెడ్డి పాడు అంశం ఎప్పటి నుంచే ఉన్నదే. కానీ కావాలనే ఇప్పుడు ఈ అంశాలను తెరమీదకు తీసుకొచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత రాజశేఖర్​రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని ఆమె పేర్కొన్నారు.

ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించాలని సీఎం జగన్​ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని ఆమె పేర్కొన్నారు.అయితే కొంతమంది కావాలనే వివాదాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే సహించబోమని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మీద కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్​ మహిళల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటుంటే .. చంద్రబాబు నాయుడు మాత్రం దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దీక్షలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా హోదా కోసమంటూ చంద్రబాబు దొంగ దీక్షలు చేశారని రోజా మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News