రెండు డోసులు తీసుకున్నా.. మాస్క్ మస్ట్..!
ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు కొన్ని దేశాలు ఇప్పటికే మాస్క్ నిబంధనను ఎత్తేశాయి. దీంతో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తున్నారు. ఈక్రమంలో డబ్ల్యూహెచ్వో ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందేనని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. ‘వ్యాక్సిన్ […]
ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు కొన్ని దేశాలు ఇప్పటికే మాస్క్ నిబంధనను ఎత్తేశాయి. దీంతో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తున్నారు. ఈక్రమంలో డబ్ల్యూహెచ్వో ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందేనని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. ‘వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా.. మాస్కు ధరించాల్సిందే. భౌతిక దూరం కూడా పాటించాలి. నిత్యం చేతులను శుభ్రపరుచుకోవాలి. జనాలు పెద్ద సంఖ్యలో గుమికూడవద్దు’ అని సూచించింది.
అమెరికాలో యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రజలు ఇక మాస్కు ధరించే అవసరం లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు మాస్క్ నిబంధనను ఎత్తేయాలన్న యోచనలో ఉన్నాయి. దీంతో డబ్ల్యూహెచ్వో ఈ విషయమై క్లారిటీ ఇచ్చేసింది. కరోనా కొత్త వేరియంట్లు వస్తున్న క్రమంలో మాస్క్ తప్పనిసరి అని పేర్కొన్నది.