కరోనా కాలంలో కంటి సమస్యలూ ఎక్కువే..
కరోనా ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్, పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్.. ఇలా అన్నిటి గురించీ మనకు తెలుసు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సమస్యకు నేరుగా కరోనాతో సంబంధం లేకపోయినా, కరోనా వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందనేది మాత్రం వాస్తవం. అంతే కాదు.. రాబోయే రోజుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు తప్పనిసరి కావడంతో భారత్ లో కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ చూడటం సహజంగానే […]
కరోనా ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్, పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్.. ఇలా అన్నిటి గురించీ మనకు తెలుసు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సమస్యకు నేరుగా కరోనాతో సంబంధం లేకపోయినా, కరోనా వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందనేది మాత్రం వాస్తవం. అంతే కాదు.. రాబోయే రోజుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
లాక్ డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు తప్పనిసరి కావడంతో భారత్ లో కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ చూడటం సహజంగానే పెరిగిపోయింది. దీంతో చాలామందికి కంటి చూపు సమస్యలు మొదలయ్యాయి. దాదాపుగా భారత్ లో 27.5కోట్లమంది కొత్తగా కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. భారత జనాభాలో ఇది 23శాతం కావడం గమనార్హం. వయసుతోపాటు వచ్చే కంటి సమస్యలే కాకుండా.. కంప్యూటర్, మొబైల్ చూడటం వల్ల వచ్చే సమస్యలే ఇప్పుడు అధికంగా వెలుగు చూస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కంటి చూపు సమస్యలు ఉన్నా కూడా.. భారత్ లోనే ఇవి ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఎందుకంటే.. లాక్ డౌన్ సమయంలో భారత్ లో కంప్యూటర్, మొబైల్, ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. 2020 ఏడాదిలో భారత్ లో సగటు స్క్రీన్ వాచింగ్ టైమ్ 6గంటల 36నిముషాలుగా ఉంది. మిగతా దేశాలతో పోల్చి చూస్తే ఇది తక్కువగా ఉన్నా కూడా.. గతంలో భారతీయులెప్పుడూ ఆ స్థాయిలో కంప్యూటర్ల ముందు కూర్చోలేదు.
ఫిలిప్పైన్స్ లో అత్యథికంగా స్క్రీన్ వాచింగ్ టైమ్ 10గంటల 56నిముషాలు కాగా, దక్షిణాఫ్రికాలో ఇది 10గంటల 6నిముషాలుగా ఉంది. చైనీయులు అత్యల్పంగా రోజులో 5గంటల 22 నిముషాలు మాత్రమే కంప్యూటర్, లేదా మొబైల్ చూస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. విచిత్రం ఏంటంటే స్క్రీన్ వాచింగ్ టైమ్ తక్కువగా ఉన్నా కూడా భారత్ లో కంటి చూపు సమస్యలు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. దేశ జనాభాలో ఏకంగా 23శాతం మంది కంటి సమస్యలతో బాధపడటం మనదేశంలో మాత్రమే ఉంది.
డేటా వినియోగంలోనూ భారత్ రికార్డ్..
లాక్ డౌన్ టైమ్ లో అత్యథికంగా మొబైల్ డేటా వినియోగించి భారతీయులు రికార్డు సృష్టించారు. 2019లో భారత్ లో సగటు నెలవారీ డేటా వినియోగం 13జీబీ కాగా, 2020లో అది 14.6జీబీగా ఉంది. డేటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే 2026నాటికి సగటున భారతీయుల నెలవారీ టేడా వినియోగం 40జీబీకి చేరుతుందని అంచనా. కంటి సమస్యలు అప్పుడు మరింత పెరిగే ప్రమాదం ఉంది.