విదేశీయానం కోసం వ్యాక్స్ పాస్‌పోర్ట్‌లు

కోవిడ్ తో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా దేశాల మధ్య రాకపోకలకు కోవిడ్ పెద్ద ఆటంకంగా మారింది. అయితే ఎప్పటిలా ప్రపంచం ముందుకెళ్లాలంటే.. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ జరగాలి. దేశాల మధ్య రాకపోకలు ఉంటేనే దేశ విదేశీ వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతాయి. అయితే కోవిడ్ కారణంగా ఆగిపోయిన ప్రపంచ రవాణాను తిరిగి ట్రాక్ లో పెట్టాలంటే వ్యాక్స్ పాస్ పోర్టులు అవసరమంటున్నారు నిపుణులు. అంటే అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు తమ ఇమ్యూనిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. […]

Advertisement
Update:2021-06-09 08:29 IST

కోవిడ్ తో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా దేశాల మధ్య రాకపోకలకు కోవిడ్ పెద్ద ఆటంకంగా మారింది. అయితే ఎప్పటిలా ప్రపంచం ముందుకెళ్లాలంటే.. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ జరగాలి. దేశాల మధ్య రాకపోకలు ఉంటేనే దేశ విదేశీ వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతాయి. అయితే కోవిడ్ కారణంగా ఆగిపోయిన ప్రపంచ రవాణాను తిరిగి ట్రాక్ లో పెట్టాలంటే వ్యాక్స్ పాస్ పోర్టులు అవసరమంటున్నారు నిపుణులు. అంటే అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు తమ ఇమ్యూనిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ప్రూఫ్‌గా వ్యాక్స్ పాస్‌పోర్టును చూపించాలి.

దీనికోసం మన ప్రభుత్వం కూడా కోవిన్ యాప్‌లో వాక్స్ ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసింది. అంటే విదేశీ సంస్థల్లో పని చేసే వారు, విదేశాల్లో చదువుకునే వారు, టోక్యో ఒలిపింక్స్ లో పాల్గొనే వారు ఇలాంటి వారందరి కోసం 84 రోజుల గ్యాప్ లో కోవీషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ను రెడీ చేసింది. దీని ద్వారా వారి వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్ తో లింక్ చేస్తారు. తద్వారా వారంతా సమయానికి ఆయా దేశాలకు బయలుదేరడానికి వీలుంటుంది.

అయితే అన్ని దేశాలు ఈ వ్యాక్స్ పాస్‌పోర్ట్ ను అడగడం లేదు. కరోనా ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశాలను కొన్ని దేశాలు రెడ్ లిస్ట్ లో ఉంచాయి. ఆయా దేశాలకు పయనమవ్వాలంటే ఈ వ్యాక్స్ పాస్‌పోర్ట్ లు తప్పని సరి.

అయితే మ‌రోప‌క్క‌ ఈ వాక్స్ పాస్‌పోర్ట్‌ల ఆలోచన సరైంది కాదని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే దుష్ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉన్న వారు అలాగే ప్రీ-టీనేజ్ వయసులో ఉన్నవారు టీకా వేయించుకోవడం ఎంతవరకూ సురక్షితమో ఇంకా తేలలేదు. ఇలాంటి సమయంలో వ్యాక్స్ పాస్‌పోర్ట్‌లు అమలు చేయడం వల్ల కేవలం విదేశీ ప్రయాణాల కోసం ప్రజలు తమకు అవసరం లేకున్నా టీకా వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతుతుంది. ఇది కొంతవరకూ నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని కొందరి వాదన. కానీ కోవిడ్ వ్యాప్తిని ఎదుర్కోవడం కోసం దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు.

Tags:    
Advertisement

Similar News