అందరికీ 2డీజీ పనికిరాదు.. కండిషన్లు ఇవే..
కరోనా చికిత్సలో సంజీవనిగా ప్రచారం జరిగిన 2డీజీ ఔషధం వాడకంపై కొత్త మార్గదర్శకాలను డీఆర్డీవో విడుదల చేసింది. అందరికీ ఈ మందు ఉపయోగించడం కుదరదని తేల్చి చెప్పింది. డాక్టర్ల సలహా లేకుండా రోగులు సొంతంగా మందు వాడకూడదని స్పష్టం చేశారు అధికారులు. 2డీజీ ఔషధాన్ని ఎవరెవరు వాడకూడదంటే.. – గర్భిణులకు వాడకూడదు – బాలింతలకు పనికిరాదు – 18 ఏళ్లలోపు వారు వాడకూడదు – గుండె సమస్యలున్నవారిపై ప్రయోగాలు చేయలేదు – షుగర్ వ్యాధి, కాలేయ, మూత్రపిండాల […]
కరోనా చికిత్సలో సంజీవనిగా ప్రచారం జరిగిన 2డీజీ ఔషధం వాడకంపై కొత్త మార్గదర్శకాలను డీఆర్డీవో విడుదల చేసింది. అందరికీ ఈ మందు ఉపయోగించడం కుదరదని తేల్చి చెప్పింది. డాక్టర్ల సలహా లేకుండా రోగులు సొంతంగా మందు వాడకూడదని స్పష్టం చేశారు అధికారులు.
2డీజీ ఔషధాన్ని ఎవరెవరు వాడకూడదంటే..
– గర్భిణులకు వాడకూడదు
– బాలింతలకు పనికిరాదు
– 18 ఏళ్లలోపు వారు వాడకూడదు
– గుండె సమస్యలున్నవారిపై ప్రయోగాలు చేయలేదు
– షుగర్ వ్యాధి, కాలేయ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఇంకా ప్రయోగాలు జరగలేదు
– ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) ఉన్నవారికి ఇది వాడకూడదు
– లక్షణాలు బయటపడిన 10రోజుల్లోపు వాడితే అత్యథిక ప్రభావం..
వాస్తవానికి 2డీజీ ఔషధాన్ని ప్రభుత్వం విడుదల చేసినప్పుడు కరోనా కట్టడికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుందనే అంచనాలున్నాయి. టీకా సామర్థ్యంపై అపోహలున్నా, వైరస్ సోకిన తర్వాత దాన్ని తగ్గించే మందు అందుబాటులోకి వచ్చిందని వైద్యవర్గాలు కూడా సంతోషించాయి. నీళ్లలో కలుపుకొని తాగే పొడిమందు కావడంతో.. దీని వినియోగం కూడా సులభంగా ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడు 2డీజీ వాడకంపై డీఆర్డీవో ప్రకటించిన మార్గదర్శకాలు చూస్తుంటే.. ఈ మందు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది.
షుగర్, గుండె సమస్యలు, శ్వాస సమస్యలున్నవారిపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విుషయం తెలిసిందే. అయితే ఆయా వ్యాధిగ్రస్తులపై 2డీజీ ప్రయోగాలు పూర్తి కాలేదు కాబట్టి వారికి వాడటం కుదరదని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మందు వాడకాన్ని పూర్తిగా ఆస్పత్రులకే పరిమితం చేశారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆస్పత్రుల్లోనే ఈ మందు ఇస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు మెయిల్ చేస్తే ఆస్పత్రులకు ఈ మందు సరఫరా చేస్తారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే దీన్ని వినియోగిస్తున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 2డీజీ ఔషధం.. జనసామాన్యంలోకి రావడానికి మరింత సమయం పట్టేట్టు తెలుస్తోంది.