వ్యాక్సిన్ వేయించుకుంటే సంతానం కష్టమే? అమెరికాలో ప్రచారం..!
కరోనా వ్యాక్సిన్ మీద చాలా రోజులుగా దుష్ప్రచారాలు సాగుతున్న విషయం తెలిసిందే. పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు చనిపోయారని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని.. కరోనాను తట్టుకొనే శక్తి వస్తుందని చాలా రోజులుగా శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా పుణ్యమా అని తప్పుడు ప్రచారమే ఎక్కువగా సాగుతోంది. భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే అయితే.. ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా […]
కరోనా వ్యాక్సిన్ మీద చాలా రోజులుగా దుష్ప్రచారాలు సాగుతున్న విషయం తెలిసిందే. పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు చనిపోయారని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని.. కరోనాను తట్టుకొనే శక్తి వస్తుందని చాలా రోజులుగా శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా పుణ్యమా అని తప్పుడు ప్రచారమే ఎక్కువగా సాగుతోంది.
భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే అయితే.. ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగనందువల్లే కేసులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
తాజాగా అమెరికాలో అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అక్కడ ప్రస్తుతం 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న అమెరికన్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మాస్కులు వాడాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకుంటే సంతానప్రాప్తిని కోల్పేయే అవకాశంఉందని అమెరికాలో ప్రచారం ఊపందుకున్నది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం ఎక్కువగా సాగుతోంది. దీంతో చాలా మంది ఈ ప్రచారాన్ని నమ్మి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
ఈ విషయంపై కైసర్ ఫామిలీ ఫౌండేషన్ ఓ సర్వే నిర్వహించింది.
‘అమెరికాలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటే తమకు సంతానం కలగదేమోనని భయపడుతున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకోవడం లేదు’ అని కైసర్ ఫామిలీ ఫౌండేషన్ డైరక్టర్ అష్లే కిర్‌జింగర్ పేర్కొన్నారు. 18 నుంచి 49 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 50 శాతం, పురుషులలో 47 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారట.
అయితే వ్యాక్సిన్ తీసుకుంటే సంతానం కలగదని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్నే నమ్మడం గమనార్హం. నిజానికి అమెరికా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉంటారు. అటువంటి దేశంలో కూడా తప్పుడు ప్రచారాలనే ప్రజలు నమ్ముతుండటం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.