మీడియాలో తప్పుడు కథనాలు.. WHO రిపోర్ట్ లో భారత్ పేరు లేదు..

భారత్ లో బయటపడిన కరోనా వైరస్ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాదకరమైన స్ట్రెయిన్ గా అభివర్ణించడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. WHO పేర్కొన్నట్టు జరుగుతున్న ప్రచారం అంతా తప్పని తేల్చింది. అసలు WHO విడుదల చేసిన 32 పేజీల నివేదికలో ఎక్కడా భారత్ పేరు లేదని, ఈమేరకు మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని కేంద్రం తెలిపింది. భారత్ వేరియంట్ ప్రమాదకరం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. బి-1617 స్ట్రెయిన్ ఆందోళనకరంగా ఉందని, […]

Advertisement
Update:2021-05-12 13:36 IST

భారత్ లో బయటపడిన కరోనా వైరస్ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాదకరమైన స్ట్రెయిన్ గా అభివర్ణించడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. WHO పేర్కొన్నట్టు జరుగుతున్న ప్రచారం అంతా తప్పని తేల్చింది. అసలు WHO విడుదల చేసిన 32 పేజీల నివేదికలో ఎక్కడా భారత్ పేరు లేదని, ఈమేరకు మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని కేంద్రం తెలిపింది. భారత్ వేరియంట్ ప్రమాదకరం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.

బి-1617 స్ట్రెయిన్ ఆందోళనకరంగా ఉందని, సాధారణ వైరస్ తో పోల్చతే ఈ వేరియంట్ త్వరగా వ్యాపిస్తోందని, దీని తీవ్రత కూడా ఎక్కువగా ఉందని WHO కొవిడ్‌ విభాగ సాంకేతిక నిపుణురాలు డా.మరియా వాన్‌ కేర్‌ కోవ్‌ కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత్‌ లో వెలుగుచూసిన ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రత గురించి తమకు అవగాహన ఉందని, దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నట్టు కూడా కథనాలు వచ్చాయి. ఈ స్ట్రెయిన్ మొదటగా భారత్ లోనే బయటపడిందని ఆమె చెప్పినట్టు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలిచ్చాయి. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన ప్రమాదకర వైరస్‌ రకాల జాబితాలో భారత్ లో వెలుగు చూసిన బి-1617 రకాన్ని కూడా WHO చేర్చిందని చెప్పారు. కరోనాను లెక్క చేయకుండా, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించడం, భౌతిక దూరం, మాస్క్‌ వంటి నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం భారత్ లో ప్రస్తుత పరిస్థితికి కారణం అని కూడా WHO చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని కేంద్రం ఖండించడంతోపాటు.. మీడియా కథనాలను కొట్టిపారేయడం ఇక్కడ కొసమెరుపు.

మిగతా ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉందనే విషయం వాస్తవం. దీంతో కొన్ని దేశాలు భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాలు.. తమ పౌరులు భారత్ నుంచి తిరిగి రావొద్దని ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో WHO విడుదల చేసిన నివేదికలో భారత్ పేరు ఉందని, భారత్ లో ఉన్న స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరం అని ప్రచారం జరగడంతో కేంద్రం రంగంలోకి దిగింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. అసలు WHO నివేదికలో భారత్ అనే పేరు లేదని, మీడియా కథనాలు అవాస్తవం అని ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News