కుదిరిన పొత్తు.. జనసేనకు మరీ 6 స్థానాలేనా?
తెలంగాణలో త్వరలో జరగబోతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో జోష్ వచ్చింది. అయితే నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో బలముందా? కేవలం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైందా? అన్న విషయంపై చాలా మంది అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదని సమాచారం. సాగర్ ఫలితాలు రాకముందే.. కొన్ని […]
తెలంగాణలో త్వరలో జరగబోతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో జోష్ వచ్చింది. అయితే నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో బలముందా? కేవలం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైందా? అన్న విషయంపై చాలా మంది అనుమానాలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదని సమాచారం. సాగర్ ఫలితాలు రాకముందే.. కొన్ని మున్సిపల్, కార్పొరేషన్ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. ఇప్పటికే ఖమ్మం కార్పొరేషన్ కు రెండు పార్టీలకు పొత్తు కుదిరింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 స్థానాలుండగా.. బీజేపీ 54 స్థానాల్లో జనసేన 6 స్థానాల్లో పోటీచేయబోతున్నదట.
అయితే తమకు కేవలం 6 స్థానాలే ఇవ్వడం ఏమిటని జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ మాత్రం దానికి పొత్తు అని ఓ పేరు పెట్టడం దేనికి అని వాళ్లు ప్రశ్నిస్తున్నారట. తెలంగాణలో జనసేనకు పెద్దగా బలం లేదు. ఆ మాటకొస్తే బీజేపీ పరిస్థితి కూడా అంతే. చాలా గ్రామాల్లో బీజేపీకి అసలు కమిటీలు కూడా ఉండవు. కేవలం నగర ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రభావం ఉంటుంది. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు గెలుపొందింది.
అయితే దుబ్బాకలో గెలవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు. అప్పటికే ఆయన రెండు సార్లు ఓడిపోయి ఉండటం, దానికి తోడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక మంచి వాక్చాతుర్యం ఉన్న నేత. దీంతో దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు.
ఇక సాగర్‌లో వచ్చే ఫలితాన్ని బట్టి ఆపార్టీ బలం ఎంతో తెలిసిపోతుంది. జనసేన కూడా తెలంగాణలో బలంగా ఏమీ లేదు. కానీ పవన్ కల్యాణ్‌కు రెండు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి తెలంగాణలోని అన్ని నియోజవర్గాల్లో ఆ పార్టీ పోటీచేస్తే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ రావచ్చు. అయితే ఖమ్మంలో మరీ తమకు ఆరు స్థానాలు ఇవ్వడం ఏమిటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.