కార్పొరేషన్ లో కలిసి పోటీ..! బీజేపీ, జనసేన నిర్ణయం..!

ఖమ్మం కొర్పొరేషన్​ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. పొత్తు విషయంపై ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుగా జనసేన పోటీచేయాలని నిర్ణయించుకున్నది. కొన్ని స్థానాలకు అభ్యర్థులు నామినేషన్​ కూడా దాఖలు చేశారు. కానీ అనూహ్యంగా జనసేన అధినేత పవన్​ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తరఫున ప్రచారం ఏమీ చేయలేదు. ఇదిలా ఉంటే ఇటీవల […]

Advertisement
Update:2021-04-18 07:38 IST

ఖమ్మం కొర్పొరేషన్​ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. పొత్తు విషయంపై ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుగా జనసేన పోటీచేయాలని నిర్ణయించుకున్నది. కొన్ని స్థానాలకు అభ్యర్థులు నామినేషన్​ కూడా దాఖలు చేశారు.

కానీ అనూహ్యంగా జనసేన అధినేత పవన్​ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తరఫున ప్రచారం ఏమీ చేయలేదు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం జనసేన .. టీఆర్​ఎస్​ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ఇవ్వడం గమనార్హం. బీజేపీ నేతలు తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని.. మిత్రధర్మం పాటించడం లేదని పవన్​ కల్యాణ్​ వ్యాఖ్యానించారు.

మరోవైపు పీవీ కూతురు వాణిదేవికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా కంగుతున్నారు. కొందరు నేతలు ఏకంగా పవన్​ కల్యాణ్​పైనే విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న తిరుపతి పార్లమెంట్​ స్థానానికి కూడా జనసేన పోటీచేయలేదు. అక్కడ బీజేపీకే మద్దతు ఇచ్చింది. కానీ అనూహ్యంగా తెలంగాణలోని ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు జనసేన ప్రకటించింది. బీజేపీతో కలిసి ఇక్కడ పోటీచేస్తామని పేర్కొన్నది.

ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నేతలు, పవన్​ కల్యాణ్ చర్చలు జరిపినట్టు సమాచారం. నిజానికి జనసేన ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉండదు. హైదరాబాద్​లో కొంత ప్రభావం చూపవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాతావరణం కాస్త విభిన్నంగా ఉంటుంది. అక్కడ కొంత ఆంధ్రా కల్చర్​ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో పోటీచేయాలని జనసేన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లాలో పవన్​ కల్యాణ్​ ఫ్యాన్స్​ బాగానే ఉన్నారు. దీంతో అక్కడి నేతల ఒత్తిడి మేరకు పోటీకి సిద్ధ పడ్డట్టు సమాచారం.

ఖమ్మం తోపాటు వరంగల్​ కార్పొరేషన్​కు కొన్ని మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కేవలం ఖమ్మంలోనే పోటీచేస్తుందా? లేక మిగతా స్థానాల్లో కూడా పోటీచేస్తుందా? అన్నది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News