తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ-జనసేన మేనిఫెస్టో..
సహజంగా ఉప ఎన్నికలకు ఏ పార్టీ కూడా మేనిఫెస్టో అంటూ హడావిడి చేయదు. అందులోనూ సార్వత్రిక ఎన్నికలు జరిగిన రెండేళ్ల లోపే వస్తున్న తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకూ అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా మేనిఫెస్టో గురించి ఆలోచించలేదు. అయితే బీజేపీ-జనసేన మాత్రం తమ అజెండాని మేనిఫెస్టో రూపంలో ప్రకటించాయి. తమ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే.. తిరుపతికి ఇచ్చే వరాలను ప్రకటించాయి. వివిధ రంగాల వారీగా వారిచ్చిన హామీలు ఇవి. ఆధ్యాత్మిక రంగం […]
సహజంగా ఉప ఎన్నికలకు ఏ పార్టీ కూడా మేనిఫెస్టో అంటూ హడావిడి చేయదు. అందులోనూ సార్వత్రిక ఎన్నికలు జరిగిన రెండేళ్ల లోపే వస్తున్న తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకూ అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా మేనిఫెస్టో గురించి ఆలోచించలేదు. అయితే బీజేపీ-జనసేన మాత్రం తమ అజెండాని మేనిఫెస్టో రూపంలో ప్రకటించాయి. తమ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే.. తిరుపతికి ఇచ్చే వరాలను ప్రకటించాయి.
వివిధ రంగాల వారీగా వారిచ్చిన హామీలు ఇవి.
ఆధ్యాత్మిక రంగం
తిరుపతి నగరాన్ని ప్రపంచ హిందూ ధర్మ క్షేత్రంగా మార్చి, హిందూ సంస్కృతి, కళలకు తిరుపతిని కేంద్రంగా చేసి, అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేయడం, టీటీడీని ధర్మాచార్యుల పర్యవేక్షణలో ఉంచడం, రాష్ట్రంలోని దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ తొలగించి ఒక సాధికారిక బోర్డు పరిధిలోకి తేవడం.
నైపుణ్యాల శిక్షణ, ఉపాధి కల్పన
చేతి వృత్తుల వారికి పనిముట్ల కొనుగోలుకి ఆర్థిక సహాయం, రుణ సౌకర్యం
ఉన్నత విద్య అభ్యసించే వారందరికీ, స్థానిక చేతి వృత్తులలో నైపుణ్యత కలిగించటాన్ని పాఠ్యాంశంలో భాగం చేయడం.
తిరుపతిలో ఇన్వెస్ట్ మెంట్ టెక్మైల్ పార్క్ ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు పరిశ్రమల స్థాపనకోసం కోటి రూపాయల వరకు ష్యూరిటీ అవసరం లేకుండానే రుణ సదుపాయం.
సంపూర్ణ ఆరోగ్యం
తిరుపతి లో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు
చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో క్రిటికల్ కేర్ ఆసుపత్రుల ఏర్పాటు
విద్య
తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలోని 30 కి పైగా పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా మార్చడం
భక్త కన్నప్ప ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు
పదో తరగతి తర్వాత దళిత విద్యార్థులకు నేరుగా కేంద్రం నుంచి స్కాలర్ షిప్ లు
పట్టణాభివృద్ధి
పట్టణంలోని ప్రతి కుటుంబానికి ఉచిత గృహ వసతి
కేంద్ర ప్రభుత్వ సాయంతో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా కోసం జలమే జీవనం పథకం అమలు
వ్యవసాయం
కేంద్ర వ్యవసాయ సెస్ నిధుల ద్వారా మార్కెట్ యార్డుల ఆధునీకరణ, శీతల గిడ్డంగుల నిర్మాణం, రైతులకు విత్రాంతి గదులు, ఇతర సౌకర్యాలు
ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్, 2 లక్షలకు తగ్గకుండా రుణ సదుపాయం
మత్స్యకార కుటుంబాలకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్, 2 లక్షలు రుణం
పులికాట్ పూడిక తీత
8 ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు వేగవంతం..
గతంలో తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయలేదు. నాగార్జున సాగర్ లో కూడా ఆ ఊసే లేనట్టు తెలుస్తోంది. అయితే తిరుపతిలో మాత్రం మేనిఫెస్టో పేరుతో బీజేపీ, జనసేన హడావిడి చేశాయి. రెండు పార్టీల నాయకులు కలసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. తిరుపతి అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని పిలుపునిచ్చారు.