కార్పొరేట్​ స్కూళ్లతో సీఎం కేసీఆర్​ కుమ్మక్కు..!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​.. సీఎం కేసీఆర్​పై మరోసారి ఫైర్​ అయ్యారు. సీఎం కేసీఆర్​ .. కార్పొరేట్​ స్కూళ్ల యాజమన్యాలతో లాలూచీ పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలల విద్యాసంవత్సరం కోసం ప్రైవేట్​ స్కూళ్లు ఏడాది ఫీజులు వసూలు చేస్తున్నాయని.. ఈ విషయం తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్​గా ఉంటుందని మండిపడ్డారు. ప్రైవేట్​ స్కూళ్లు ఇటు తమ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని.. లాక్​డౌన్ టైంలో చాలా మంది టీచర్లు రోడ్డున […]

Advertisement
Update:2021-03-01 12:57 IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​.. సీఎం కేసీఆర్​పై మరోసారి ఫైర్​ అయ్యారు. సీఎం కేసీఆర్​ .. కార్పొరేట్​ స్కూళ్ల యాజమన్యాలతో లాలూచీ పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలల విద్యాసంవత్సరం కోసం ప్రైవేట్​ స్కూళ్లు ఏడాది ఫీజులు వసూలు చేస్తున్నాయని.. ఈ విషయం తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్​గా ఉంటుందని మండిపడ్డారు. ప్రైవేట్​ స్కూళ్లు ఇటు తమ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని.. లాక్​డౌన్ టైంలో చాలా మంది టీచర్లు రోడ్డున పడ్డారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు విద్యార్థుల నుంచి మాత్రం మొత్తం ఫీజు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్​ విద్యాసంస్థల్లో చాలా మంది టీఆర్​ఎస్​ నేతలకు వాటాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి సైలెంట్​గా ఉన్నారన్నారు. ఫీజుల దోపిడీపై త్వరలో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపబోతున్నదని హెచ్చరించారు. చాలా మంది టీఆర్​ఎస్​ నేతలు కార్పొరేట్​ స్కూళ్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా బండి సంజయ్​ ఆరోపించారు.

ఆదివారం హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం కార్యకర్తలతో బండి సంజయ్​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడలో రెండు రోజుల కిందట జరిగిన బీజేపీ బహిరంగ సభలో నరసింహా అనే తొమ్మిదేళ్ల బుడ్డోడు కేసీఆర్​ పాలనపై విమర్శలు గుప్పించారు. ఆ బుడ్డోడు బీజేపీ రాష్ట్ర నేతల హావభావాలతో మెప్పించాడు. దీంతో బుడ్డోడి ప్రతిభకు బండి సంజయ్​ ఫిదా అయ్యారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నరసింహాతో కలిసి లంచ్ చేశారు.

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య వెనుక టీఆర్‌ఎ్‌సకు చెందిన బడా నేతలు, కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ హత్యపై టీఆర్​ఎస్​ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టడం లేదని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News