హమ్మయ్య .. ఇక్కడైనా ట్రంప్ పరువుదక్కింది..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోయారు. అసలు ఆయన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని అంగీకరించలేదు. చాలా అయిష్టంగా, ఓ రకంగా చెప్పాలంటే బలవంతంగా ఆయన వైట్‌హౌస్‌ను వదిలివెళ్లారు. ట్రంప్ అమెరికా ఎన్నికల వ్యవస్థను, అక్కడి న్యాయస్థానాలను కూడా తప్పుపట్టారు. ఓ దశలో ట్రంప్ మద్దతుదారులు అమెరికా పార్లమెంట్ భవనంపై దాడికి తెగబడ్డారు. విధ్వంసాలు చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ పై కొత్త ప్రభుత్వం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ అభిశంసన విచారణలో […]
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోయారు. అసలు ఆయన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని అంగీకరించలేదు. చాలా అయిష్టంగా, ఓ రకంగా చెప్పాలంటే బలవంతంగా ఆయన వైట్‌హౌస్‌ను వదిలివెళ్లారు.
ట్రంప్ అమెరికా ఎన్నికల వ్యవస్థను, అక్కడి న్యాయస్థానాలను కూడా తప్పుపట్టారు. ఓ దశలో ట్రంప్ మద్దతుదారులు అమెరికా పార్లమెంట్ భవనంపై దాడికి తెగబడ్డారు. విధ్వంసాలు చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ పై కొత్త ప్రభుత్వం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ అభిశంసన విచారణలో ట్రంప్ బయటపడ్డారు. ఆయన మీద పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం నెగ్గాలంటే సెనేట్‌లో మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు తెలపాలి. కానీ సభ్యుల మద్దతు లేకపోవడంతో తీర్మానం వీగిపోయింది.
సెనేట్‌లో 100 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసనకు అనుకూలంగా 57 మంది.. వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. దీంతో ట్రంప్ అభిశంసన నుంచి బయటపడ్డారు. అయితే రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లేయడం గమనార్హం..
గత జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి చేశారు. ఈ క్రమంలో ట్రంప్ చేసిన పలు ట్వీట్లు కూడా వివాదాస్పదంగా మారాయి. ట్విట్టర్ వాటిని తొలగించినప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిశంసన విచారణ పలు కీలక మలుపులు తిరిగిన అనంతరం శనివారం తుది దశకు చేరుకున్నది.