బ్రిటన్ శరణార్థిగా మారనున్న విజయ్ మాల్యా?

బ్యాంకులను మోసం చేసి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను తిరిగి ఇండియా రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. తనను ఇండియాకు అప్పగించవద్దని బ్రిటన్ సుప్రీంకోర్టును మాల్యా ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను గత ఏడాదే కోర్టు కొట్టేసింది. దీంతో మాల్యా ఇండియాకు రావడం ఖాయమేనని అందరూ భావించారు. అయితే మాల్యా అప్పగింతలో బ్రిటన్ హోంశాఖ నుంచి అనుమతుల మంజూరు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఈ వ్యవహారం ఇలా పెండింగ్‌లో ఉండగానే మాల్యా మరో మార్గంలో తనను […]

Advertisement
Update:2021-01-23 04:36 IST

బ్యాంకులను మోసం చేసి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను తిరిగి ఇండియా రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. తనను ఇండియాకు అప్పగించవద్దని బ్రిటన్ సుప్రీంకోర్టును మాల్యా ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను గత ఏడాదే కోర్టు కొట్టేసింది. దీంతో మాల్యా ఇండియాకు రావడం ఖాయమేనని అందరూ భావించారు.

అయితే మాల్యా అప్పగింతలో బ్రిటన్ హోంశాఖ నుంచి అనుమతుల మంజూరు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఈ వ్యవహారం ఇలా పెండింగ్‌లో ఉండగానే మాల్యా మరో మార్గంలో తనను తాను రక్షించుకునే పనిలో పడ్డారు. బ్రిటన్‌ను తనను శరణార్థిగా గుర్తించమని కోరినట్లు తెలుస్తున్నది. ఆయనకు తెలిసిన మార్గాల ద్వారా మాల్యా బ్రిటన్‌లోనే ఉండేలా హోం మంత్రి ప్రీతి పటేల్‌కు దరఖాస్తు చేసినట్లు సమాచారం.

కాగా, మాల్యాకు సంబంధించి ఒక రహస్య న్యాయప్రక్రియ కొనసాగుతున్నదని హోం శాఖ ఇటీవలే పేర్కొన్నది. ఆయన శరణార్థిగా ఉండేందుకే ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బ్రిటన్ కనుక మాల్యాను శరణార్థిగా ఉండటానికి అంగీకరిస్తే.. ఇక అతడి అప్పగింత సాధ్యం కాకపోవచ్చు.

Tags:    
Advertisement

Similar News