మహిళా కమిషనర్‌ బట్టలూడదీస్తామన్నఅయ్యన్న... ఆ మాత్రం దానికే నిర్భయ కేసా? " వర్ల రామయ్య

మహిళా కమిషనర్‌ బట్టలూడదీస్తామన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖండించారు. మహిళా కమిషనర్‌పై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఇదంతా కక్షసాధింపు అని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడి లాంటి నేతలపై కేసులకు వ్యతిరేకంగా బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అటు టీడీపీ నేత వర్ల రామయ్య కూడా చింతకాయల అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదును తప్పుపట్టారు. […]

Advertisement
Update:2020-06-18 03:14 IST

మహిళా కమిషనర్‌ బట్టలూడదీస్తామన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖండించారు. మహిళా కమిషనర్‌పై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఇదంతా కక్షసాధింపు అని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడి లాంటి నేతలపై కేసులకు వ్యతిరేకంగా బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

అటు టీడీపీ నేత వర్ల రామయ్య కూడా చింతకాయల అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదును తప్పుపట్టారు. మహిళా కమిషనర్‌ బట్టలూడదీస్తామన్న చింతకాయల అయన్నపాత్రుడి వ్యాఖ్యలపై స్పందిస్తూ… ” మాట తూలితేనే అయ్యన్నపై నిర్భయ కేసా? కరుడుగట్టిన నేరస్తులను శిక్షించేందుకు రూపొందించిన నిర్బయ చట్టం మీ పాలనలో రూపు మార్చుకుందా జగన్‌? మాట తూలడంపై ఇతర సెక్షన్లేవీ లేవా? ” అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

నిజానికి నిర్బయ చట్టం చాలా శక్తివంతమైనది. మహిళలపై దాడి చేయడం కాదు… వారిని కించపరిచే వ్యాఖ్యలు చేసినా… వారివైపు తదేకంగా చూసినా, వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినా నిర్బయ చట్టం వర్తిస్తుంది. కేవలం మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసినప్పుడు మాత్రమే నిర్భయ కేసు పెట్టాలనడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News