రంగంలోకి ఆర్మీని దింపుతా... గవర్నర్లపై ఉరిమిన ట్రంప్

అమెరికా అల్లర్లతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు ఒక పోలీసు అధికారి చేతిలో ప్రాణాలు కోల్పోవడాన్ని నిరసిస్తూ దేశంలోని పలు ప్రధాన పట్టణాల్లో పెద్దెత్తున నిరసనలు జరుగుతున్నాయి. అవి అదుపు తప్పాయి. చాలా చోట్ల దోపిడీలు జరుగుతున్నాయి. మాల్స్‌లోకి జనం చొరబడి దొరికింది దోచుకెళ్తున్నారు. వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఇది అమెరికా చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నారు. చివరకు ఆందోళనకారులు వైట్‌హౌజ్‌ వరకు రావడంతో గంట పాటు ట్రంప్ బక్కర్‌లో దాక్కోవాల్సి వచ్చింది. పరిస్థితి మరింత దిగజారిపోతుండడంతో […]

Advertisement
Update:2020-06-03 02:20 IST

అమెరికా అల్లర్లతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు ఒక పోలీసు అధికారి చేతిలో ప్రాణాలు కోల్పోవడాన్ని నిరసిస్తూ దేశంలోని పలు ప్రధాన పట్టణాల్లో పెద్దెత్తున నిరసనలు జరుగుతున్నాయి. అవి అదుపు తప్పాయి. చాలా చోట్ల దోపిడీలు జరుగుతున్నాయి. మాల్స్‌లోకి జనం చొరబడి దొరికింది దోచుకెళ్తున్నారు. వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఇది అమెరికా చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నారు.

చివరకు ఆందోళనకారులు వైట్‌హౌజ్‌ వరకు రావడంతో గంట పాటు ట్రంప్ బక్కర్‌లో దాక్కోవాల్సి వచ్చింది. పరిస్థితి మరింత దిగజారిపోతుండడంతో ట్రంప్ గట్టిగా స్పందించారు. గవర్నర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లను అదుపు చేయకుండా కొందరు గవర్నర్లు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్‌ ఫైర్ అయ్యారు.

విధ్వంసాలకు పాల్పడుతున్న వారిని వెంటాడి తరమాల్సిన అవసరం ఉందన్నారు. అరెస్ట్ చేసి కనీసం పదేళ్ల పాటు జైలులో ఉంచాలని వ్యాఖ్యానించారు. తాము వాషింగ్టన్ డీసీలో అదే చేస్తున్నామని ట్రంప్ చెప్పారు. చాలా మంది గవర్నర్లు అవసరమైన సంఖ్యలో జాతీయ భద్రతా దళాలను వాడడం లేదని ట్రంప్ ఆగ్రహించారు. వెంటనే పరిస్థితిని అదుపు చేయాలని లేనిపక్షంలో సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అల్టిమేటం ఇచ్చారు ట్రంప్.

పౌరుల హక్కులను కాపాడడంలో స్థానిక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా భారీగా భద్రతా దళాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తేవాలని ఆదేశించారు. ఏ స్థానిక ప్రభుత్వమైనా అలా వ్యవహరించకుంటే తానే నేరుగా సైన్యాన్ని రంగంలోకి దింపి… తక్షణం పరిస్థితిని అదుపులోకి తెస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి ఇవి మార్గాలు కావని… అల్లరి మూకలది, హింసావాదులది, దోపిడిదారులది ఇష్టారాజ్యం అయిపోయిందని ట్రంప్ ఉరిమారు.

జార్జి ఫ్లాయిడ్‌ పట్ల వ్యవహరించిన తీరును తాను కూడా ఖండిస్తున్నానని చెప్పారు. నేరం చేసిన అధికారిని చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. అమెరికన్లు దేనినైనా నిర్మించాలే గానీ… కూల్చకూడదని…మన దేశం ఎన్నడూ నెగ్గుతూనే ఉండాలని… అలాగే ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అటు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేస్తున్న వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారిని చేతులు వెనక్కు కట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు.

Tags:    
Advertisement

Similar News