చంద్రబాబుపై హైకోర్టుకు ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి లేఖ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి వెళ్తూ రోడ్డు వెంబడి చేసిన హడావుడి వివాదాస్పదమవుతోంది. మొన్నటి వరకు అందరూ భౌతిక దూరం పాటించాలి, లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని జూమ్‌లో చెప్పిన చంద్రబాబునాయుడు… తాను మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. హైదరాబాద్ నుంచి వెళ్తూ దారిపొడవున టీడీపీ కార్యకర్తల చేత ఘనస్వాగతం అందుకున్నారు. కార్యకర్తలకు కారులో నుంచే అభివాదం చేస్తూ ముందుకుసాగాల్సిందిపోయి… కారు నుంచి బయటకు వచ్చి నడిరోడ్డుపై విక్టరీ సింబల్ చూపుతూ చంద్రబాబు హడావుడి […]
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి వెళ్తూ రోడ్డు వెంబడి చేసిన హడావుడి వివాదాస్పదమవుతోంది. మొన్నటి వరకు అందరూ భౌతిక దూరం పాటించాలి, లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని జూమ్‌లో చెప్పిన చంద్రబాబునాయుడు… తాను మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.
హైదరాబాద్ నుంచి వెళ్తూ దారిపొడవున టీడీపీ కార్యకర్తల చేత ఘనస్వాగతం అందుకున్నారు. కార్యకర్తలకు కారులో నుంచే అభివాదం చేస్తూ ముందుకుసాగాల్సిందిపోయి… కారు నుంచి బయటకు వచ్చి నడిరోడ్డుపై విక్టరీ సింబల్ చూపుతూ చంద్రబాబు హడావుడి చేశారు. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ వెంట బైక్ ర్యాలీలు చేశారు.
కొద్దిరోజలు క్రితం వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసరాలు సరఫరా చేస్తే ఇదే టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. అందుకు స్పందించిన హైకోర్టు ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సీబీఐకి ఎందుకు అప్పగించకూడదు అంటూ అసాధారణ రీతిలో స్పందించింది.
చంద్రబాబు లాక్‌డౌన్ నిబంధనలను యదేచ్చగా ఉల్లంఘించిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. చంద్రబాబు, నారా లోకేష్‌లు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
చంద్రబాబు కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా కార్యకర్తలతో రోడ్డుపైనే చర్చలు పెట్టారని… దీన్ని తీవ్రంగా పరిగణించి సుమోటోగా స్వీకరించాలని కోరారు. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గోపాల్ రెడ్డి లేఖపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైసీపీ ఎమ్మెల్యేలు పేదలకు నిత్యావసరాలు పంచితే సీబీఐకి ఎందుకు ఆదేశించకూడదు అని ప్రశ్నించిన హైకోర్టు… చంద్రబాబు విషయంలోనూ అంతే తీవ్రంగా స్పందిస్తుందో లేదో చూడాలి.