సినిమాను తలపించేలా ఆటో డ్రైవర్ హత్య
హనీట్రాప్ విసిరి హత్య చేసిన దంపతులు.. మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్‌లో సినిమాను తలపించేలా ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఆటో డ్రైవర్‌ను హత్య చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్య, కుమార్తెతో కలిసి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటుంటున్నాడు. ఏడో తరగతి చదువుతున్న కారు డ్రైవర్ కుమార్తెను నిజాంపేటకు చెందిన ఆటోడ్రైవర్ కుమార్ తీసుకెళ్లి యూసఫ్‌గూడ్‌లోని ఓ గదిలో నిర్బంధించాడు. లైంగికదాడికి యత్నించగా ఆమె తప్పించుకుని పారిపోయింది. బాలానగర్ పోలీసులకు కనిపించిన ఆమెను విచారిస్తే.. అనాథనని చెప్పడంతో వాళ్లు ప్రత్యేక శిబిరానికి తరలించారు. మరోవైపు బాలిక కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. కొవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం కొనుగోలు చేసిన ఆమె లాప్‌టాప్‌ను తల్లిదండ్రులు పరిశీలించారు. స్నాప్‌చాట్‌లో ఉన్న ఓ ఫోన్ నంబర్‌ను గుర్తించగా.. అది కుమార్‌ది అని తేలింది.
తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడనే అనుమానంతో భార్యతో కలిసి స్నాప్ చాట్ ద్వారా నిజాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కుమార్ ను హనీట్రాప్ చేశారు. హనీట్రాప్ చేసినబాలిక తల్లి ఆటో డ్రైవర్‌ను మియాపూర్‌కు రప్పించింది. ఆటోడ్రైవర్‌ను కిడ్నాప్ చేసి కారులో సూర్యాపేటకు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తమ కుమార్తె సమాచారం చెప్పాలని నిలదీశారు. తన నుంచి బాలిక తప్పించుకుని పారిపోయిందని చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు అతనిపై తీవ్రంగా దాడి చేశారు. ముందుగా అతని ప్రైవేట్ పార్ట్స్‌లో దారుణంగా కొట్టడంతో అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. నిందితులిద్దరూ కారులో అతడిని సూర్యపేటవైపు తీసుకెళ్లి పెద్ద బండరాయికి కాళ్లు, చేతులకు కట్టి బతికుండగానేగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి తోసేశారు. దీంతో కుమార్ మృతి చెందాడు
ఈ క్రమంలో బోరబండ పీఎస్‌లో కుమార్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ తర్వాత కారు డ్రైవర్ కుమార్తె తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నది. మరోవైపు కుమార్ ఆటోను కారు డ్రైవర్ వాడుతుండగా.. అతని బంధువులు గుర్తించారు. దీనిపై వారు పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసు కీకల మలుపు తిరిగింది. సూర్యపేట జిల్లా పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ఎముకలను డీఎన్ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
2023 మార్చిలో ఆటో డ్రైవర్‌మిస్సింగ్ కేసు ఆధారంగా హత్య కేసు పోలీసులు ఛేదించారు. ఆటో క్యూర్ ఆర్ కోడ్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేశామని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్‌ను చంపిన ఇద్దరు దంపతులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నది. బాలికను అనాథ ఆశ్రమంలో ఉంచారు. ఆమె ద్వారా మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టనున్నారు. సినీ అవకాశాల పేరుతో తమ కుమార్తెను అపహరించినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.