అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ నటిస్తున్నట్లే ఉన్నది
ఎవరో రాసిన నోట్‌ను అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో చదివారని ఎంపీ విమర్శ
Advertisement
అల్లు అర్జున్ మానవత్వం మరిచినట్లు ఉన్నదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. అల్లు అర్జున్ మీడియా సమావేశంపై ఆయన స్పందించారు. ఎవరో రాసిన నోట్‌ను అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో చదివారు. నోట్‌లో ఉన్నది చదవడం విడ్డూరంగా ఉన్నది. అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ నటిస్తున్నట్లే ఉన్నది. పుష్ప2 సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉండి రేట్లు పెంచారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వాస్తవాలు చెప్పారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ బాధ్యతగా ఉండాలని చామల చెప్పారు.
Advertisement