పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు
ఆయన సినీ హీరో కావొచ్చు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని డీజీపీ సూచన
Advertisement
పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనతో పాటు నటుడు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా స్పందించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా డీజీపీ మాట్లాడారు. వ్యక్తిగతంగా ఎవరికీ మేం వ్యతిరేకం కాదు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని అన్నారు. ఆయన సినీ హీరో కావొచ్చు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు. ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదని డీజీపీ పేర్కొన్నారు.
Advertisement