నాలుగుసార్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉండి నల్గొండకు ఏం చేశావ్?
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్గొండ బీఆర్ఎస్ నేతల ఫైర్
కోమటిరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించి కనీసం నల్గొండ పట్టణంలో ఒక్క రోడ్డు వేయించలేకపోయారని మండిపడ్డారు. అది మంత్రి చాతగానితనమని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పదేళ్లు నల్గొండ జిల్లాకు ఏం చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్న దయనీయమైన, దౌర్భాగ్యమైన సన్నివేశాన్ని చూశాం. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఒకాయన ఉండే ఆయను అడగండి మేం ఏం చేశామో తెలుస్తుందన్నారు. ఇంతకంటే దిక్కమాలిన పరిస్థితి, మాటలు, అబద్ధపు ప్రచారాలు ఇంకోటి ఉండవనని ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా అదృష్టం బాగుండి ఎంపీగా గెలిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గవర్గాలు ఆయన నియోజకవర్గంలోనే ఉంటాయి. కోమటిరెడ్డి ఏం చేశావని అడుగుదామంటే నల్గొండలోనైనా, తుంగతుర్తి, ఈ వేదిక మీద ఉన్న మా మాజీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనైనా చర్చకు సిద్ధమని గాదరి కిషోర్ సవాల్ విసిరారు.
సమైక్య పాలకుల సంకలో చేరి .. మీ పదవుల కోసం సంకలు నాక్కుంటా ఉండే పరిస్థితి ఆరోజు కనిపించింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతే నల్గొండ పట్టణం ఎంత అభివృద్ధి చెందింది అనేది సాక్షాత్తూ కనిపిస్తున్నది. ఇరిగేషన్‌లో ఏమీ రాలేదంటున్నారు. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్‌ఆర్‌ఎస్పీ ఫేజ్2 ఉంటుంది. దానికి చంద్రబాబు, వైఎస్‌ఆర్ కొబ్బరికాయ కొట్టారు గాని నీళ్లు మాత్రం రాలేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత నీటిని లిఫ్ట్ చేసి మిడ్ మానేరు, లోయర్ మానేరు ద్వారా కిందికి వచ్చిన కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా నే మా తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్లు వచ్చాయన్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో మా నాయకుడు హరీశ్ చెప్పారు. మూడు కొత్త జిల్లాలు, మూడు మెడికల్ కాలేజీలు, కావాల్సినటువంటి ఇరిగేషన్, నల్గొండ పట్టణం ఎంత అభివృద్ధి వెంకట్‌రెడ్డికి కనిపించడం లేదా? అని నిలదీశారు. ఆయన పొద్దున లేస్తే తాగి పడుకుంటే మీకు ఎక్కడ కనిపిస్తుందనే పరిస్థితి వచ్చిందన్నారు. బ్రీత్ ఎనలైజర్లు పెట్టి ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఉన్నదని మాట్లాడితే ఐదు నిమిషాల్లో పారిపోయాడని ఆరోపించారు. రోడ్లు,భవనాల శాఖామంత్రిగా కోమటిరెడ్డి సంవత్సరంలో ఎప్పుడైనా నల్గొండ జిల్లా రోడ్లపై సమీక్ష చేశారా? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆపుతా అని కోమటిరెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక వేదికపై కూర్చుని థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభం చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగదీష్ రెడ్డిపై,బీఆర్ఎస్ నేతలను తిడితే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో కేసీఆర్ ఫ్లోరైడ్ ను లేకుండా చేశారు. యాదాద్రి దేవాలయన్ని పునర్నిర్మాణం చేశారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు తమ ఆస్తులు పెంచుకుని జిల్లాకు ఫ్లోరిన్ ను పెంచారని విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యధిక పంట నల్గొండ జిల్లాలో పండుతున్నదని తెలిపారు.. కాంగ్రెస్ నేతలు నల్గొండ జిల్లాను నాశనం చేశారని, ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగారని, కాంగ్రెస్ నేతలకు ఒకరంటే ఒకరికి పడదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమన్నారు.
ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలిపారు. రైతుబంధు ప్రవేశపెట్టారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి,కోదాడ నియోజకవర్గాలకు నీళ్లు అందించారని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కేసీఆర్ రాజీపడలేదన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో వైఫల్యం చెందింది అన్నారు. ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చారని, లగచర్లలో గిరిజనులను ఇబ్బంది పెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. జగదీష్ రెడ్డికి,కోమటిరెడ్డికి చాలా తేడా ఉందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడతారో ఎవరికి అర్ధం కాదని ఎద్దేవా చేశారు.
మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ..కోమటిరెడ్డి మాటలను చూసి అబద్ధాలు సిగ్గు పడతాయన్నారు. కోమటిరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా,ఒక సారి ఎంపీగా గెలిచి రియల్ ఎస్టేట్ వాళ్ళ నుండి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.కోమటిరెడ్డితో నేను చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధిచెందిందన్నారు. కాళేశ్వరం నీళ్లు భువనగిరి వరకు వస్తున్నాయని తెలిపారు. సంవత్సరం కాలంలో కోమటిరెడ్డి ఏం చేశారోప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల కేంద్రం వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని, ఆలేరులో చిన్న అండర్ పాస్ బ్రిడ్జిని కోమటిరెడ్డి పూర్తి చేయడం లేదన్నారు.ప్రజలు తిరగబడితే కోమటిరెడ్డి రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..కోమటిరెడ్డి పచ్చి పొలిటికల్ బ్రోకర్ అని విమర్శించారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎట్లా భరిస్తుందో అర్థం కావడం లేదన్నారు.. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి ఓట్లు వేయమనిచెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి అబద్దాలను నిజం చేయాలని చూస్తున్నారు. మునుగోడు అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా,ఒక సారి ఎంపీగా,రెండు సార్లు మంత్రిగా కోమటిరెడ్డి తట్టెడు మట్టి ఎత్తలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పదవి పిచ్చి తప్ప వేరే ధ్యాస లేదన్నారు. మేము చేసిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభంచేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్ధం కావడం లేదు. బిల్లులకు 13 శాతంకమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను అరెస్టు చేసే ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉన్నదా? అని ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేస్తే తెలంగాణ భగ్గుమంటుందన్నారు. పగతో కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్తున్నారు. మేము అధికారంలోకివస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు.
చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణలో జిల్లా కలెక్టరేట్లు ఉన్నట్లు ఇతర రాష్ట్రాల్లో సచివాలయాలు లేవని కోమటిరెడ్డి అనలేదా అని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరకు రానివ్వకపోతే కోమటిరెడ్డి దీక్ష చేశారు. కాంగ్రెస్ నేతలు రాకపోతే హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలను కోమటిరెడ్డి నల్గొండకు పిలుచుకున్నారు. కోమటిరెడ్డి జోకర్ గా మారారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాను కించపరుస్తున్నారని,సీఎం పదవికి గౌరవం లేకుండా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలన్నారు.