కాంగోలో ఘోర ప్రమాదం..38 మంది మృతి

పడవ బోల్తా పడిన ఘటనలో 100 మందికిపైగా గల్లంతయినట్లు అధికారుల వెల్లడి

Advertisement
Update:2024-12-22 11:38 IST

కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. పడవ బోల్తా పడి 38 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికిపైగా గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఫెర్రీలో 400 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నాఉ. వారంతా క్రిస్మస్‌ వేడుకల కోసం సొంతూళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. గల్లంతైన వారిలో ఇప్పటివరకు 20 మందిని రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫెర్రీ సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. నాలుగురోజుల కిందట కూడా ఓ నదిలో పడవ బోల్తా పడి 25 మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించవద్దని అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రయాణికులను తరలించే పడవలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News