సీఎం రేవంత్‌రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి
సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్న మంత్రి
సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించడానికి లీగల్ టీమ్ ఒప్పుకోలేదనటం హాస్యాస్పదం. అసెంబ్లీ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి తెలిపారు.
అల్లు అర్జున్‌లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు: ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలను తప్పు పట్టేలా సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు తీరు దారుణంగా ఉందని అన్నారు. అల్లు అర్జున్‌లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. రేవతి కుటుంబంపై సానుభూతి చూపించలేదు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తెచ్చిన ప్రస్తావనపైనే సీఎం స్పందించారు. పోలీసులు చెప్పినా వినకుండా అల్లు అర్జున్ థియేటర్‌లో షో చేశారు. ప్రాణాల కంటే ఆయనకు పేరు ప్రతిష్టలు ఎక్కువా? అని శ్రీనివాస్ ప్రశ్నించారు.