కరోనా అంతం కాకపోవచ్చు... హెచ్.ఐ.వి. పోలేదుగా... ఇదీ అలాగే కావచ్చు
కరోనా వైరస్ పూర్తిగా అంతం కాకపోవచ్చునని, ఆ వైరస్ తో సర్దుకు పోయి బతక తప్పదేమోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. జనం ఒక చోట గుమికూడకుండా అనేక దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ఈ వ్యాప్తి నిరోధం సాధ్యం కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మంది మరణించారు. “ఈ వైరస్ కొత్తది కనక దీన్ని ఎప్పుడు అదుపు చేయగలమో చెప్పలేం” అని ప్రపంచ […]
కరోనా వైరస్ పూర్తిగా అంతం కాకపోవచ్చునని, ఆ వైరస్ తో సర్దుకు పోయి బతక తప్పదేమోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.
జనం ఒక చోట గుమికూడకుండా అనేక దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ఈ వ్యాప్తి నిరోధం సాధ్యం కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మంది మరణించారు.
“ఈ వైరస్ కొత్తది కనక దీన్ని ఎప్పుడు అదుపు చేయగలమో చెప్పలేం” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వ్యవహారాల డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ అన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన తరువాత శవాల కొట్టాల్లో మృతదేహాలను లెక్కబెడ్తూ కూర్చుంటే లాభం లేదని ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.
ఎంత అదుపు చేసినా కరోనా వైరస్ సంపూర్ణంగా తొలగిపోక పోవచ్చు… హెచ్.ఐ.వి. పోలేదుగా… ఇదీ అలాగే కావచ్చు అని ర్యాన్ అన్నారు.
లాక్ డౌన్ నిబంధనలను సడలించినందువల్ల కరోనా మరో సారి విజృంభించదని చెప్పలేం అని కూడా ఆయన అన్నారు.