రెడ్ జోన్ లలో తప్ప... మిగతా చోట్ల లాక్‌డౌన్ ఎత్తివేత?

సీఎంలతో సమావేశమైన ప్రధాని మోడీ 3 తర్వాత కేవలం రెడ్ జోన్లలోనే లాక్ డౌన్ మెజార్టీ సీఎంల అభిప్రాయం కూడా అదే దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రెడ్ జోన్ లకే లాక్‌డౌన్ పరిమితం చేయనున్నారా..? మే 3 తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేయనున్నారా?… అంటే అవుననే సమాధానమే వస్తోంది. కరోనా ప్రభావం కారణంగా దేశంలో మే3 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కట్డడికి చర్యలు, లాక్‌డౌన్ ఎత్తివేత […]

Advertisement
Update:2020-04-27 09:35 IST
  • సీఎంలతో సమావేశమైన ప్రధాని మోడీ
  • 3 తర్వాత కేవలం రెడ్ జోన్లలోనే లాక్ డౌన్
  • మెజార్టీ సీఎంల అభిప్రాయం కూడా అదే

దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రెడ్ జోన్ లకే లాక్‌డౌన్ పరిమితం చేయనున్నారా..? మే 3 తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేయనున్నారా?… అంటే అవుననే సమాధానమే వస్తోంది. కరోనా ప్రభావం కారణంగా దేశంలో మే3 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కట్డడికి చర్యలు, లాక్‌డౌన్ ఎత్తివేత తదితర అంశాలపై సోమవారం అన్ని రాష్ట్రాల సీయంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

లాక్‌డౌన్ ఎత్తివేతపై ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని.. కానీ కరోనా ప్రభావం ఇంకా తగ్గు ముఖం పట్టలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలు మినహా.. మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తివేతకు ఆయన సముఖంగా ఉన్నట్లు సమావేశంలో చెప్పారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తొమ్మిది మంది సీఎంలలో ఐదుగురు లాక్‌డౌన్ ఎత్తివేతకే మొగ్గు చూపినట్లు సమాచారం. కాగా మిగిలిన నలుగురు మాత్రం లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు.

లాక్‌డౌన్‌ను ఎత్తి వేసే విషయంపై ప్రణాళికలు వేసుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు. రెడ్, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ ల పరిధిలో లాక్‌డౌన్‌ క్రమంగా ఎలా ఎత్తివేయాలన్న అంశాలపై ఆలోచించాలన్నారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ లలో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు తప్పని సరిగా ధరిస్తూ వాణిజ్య కార్యకలాపాలు జరపాలని ఆయన సూచించారు.

లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయకపోయినా మరికొన్ని వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్రాలు కోరాయి. అలాగే కరోనా కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయినందున రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ అందించాలని సీఎంలు కోరారు. అలాగే ఆదాయం తెచ్చిపెట్టే మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని.. అదే సమయంలో బార్లు, విద్యాసంస్థలు, ప్రజారవాణాను మూసివేసి ఉంచాలని కోరారు. ఈరోజు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ క్రోఢీకరించి త్వరలో పీఎంవో ప్రకటన వెలువరించే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News