సుందర్ పిచాయ్‌కి రూ. 2,144 కోట్ల వేతనం చెల్లించిన ఆల్ఫాబెట్

ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌కి 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 281 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2,144 కోట్లు) పారితోషికం చెల్లించినట్లు ప్రకటించింది. భారత సంతతికి చెందిన పిచాయ్ గత ఏడాది డిసెంబర్ 3న ఆల్ఫాబెట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అందుకున్న పారితోషికంతో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న సీఈవోల జాబితాలోనికి ఆయన చేరారు. కాగా, గూగుల్ మరియు ఆ సంస్థకు చెందిన ఇతర సబ్సిడరీ కంపెనీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చాలనే […]

Advertisement
Update:2020-04-25 14:48 IST

ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌కి 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 281 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2,144 కోట్లు) పారితోషికం చెల్లించినట్లు ప్రకటించింది. భారత సంతతికి చెందిన పిచాయ్ గత ఏడాది డిసెంబర్ 3న ఆల్ఫాబెట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అందుకున్న పారితోషికంతో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న సీఈవోల జాబితాలోనికి ఆయన చేరారు.

కాగా, గూగుల్ మరియు ఆ సంస్థకు చెందిన ఇతర సబ్సిడరీ కంపెనీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చాలనే నిర్ణయంలో భాగంగా 2015 అక్టోబర్ 2న ఆల్ఫాబెట్ కంపెనీని స్థాపించారు. నాలుగేండ్ల క్రితం ఏర్పడిన ఈ కంపెనీ కిందే గూగులతో పాటు ఇతర సంస్థలు పని చేస్తున్నాయి. సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవో నుంచి ప్రమోషన్ ఇచ్చి అతడిని ఆల్ఫాబెట్ సీఈవోగా నియమించారు.

పిచాయ్ గత ఏడాది 6,50,000 డాలర్లు పారితోషికం అందుకోగా.. ఇప్పుడు అతడి పారితోషికాన్ని 2 మిలియన్ డాలర్లకు పెంచింది. కాగా, అతని వేతనంలో ఎక్కువ భాగం స్టాక్స్ అవార్డుల రూపంలోనే ఇస్తారు. దీంతో ఆల్ఫాబెట్ షేర్ల వాల్యూ ప్రకారం అతని వేతనం మారుతూ ఉంటుంది. షేర్ వాల్యూ పెరిగితే వేతనం పెరగడం, తగ్గితే పిచాయ్ వేతనం తగ్గడం జరుగుతుంది. ఇక ఆల్ఫాబెట్ కంపెనీలో పని చేసే ఉద్యోగుల సరాసరి జీతం కంటే సుందర్ పిచాయ్ జీతం 1,085 రెట్లు ఎక్కువని కంపెనీ తెలిపింది.

ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ఐటీ సంస్థలు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది కొత్త ఉద్యోగాలు, పెట్టుబడుల ప్రణాళికల్లో భారీగా కోత విధిస్తున్నట్లు సీఈవో పిచాయ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ఆల్ఫాబెట్ వ్యాపారం తగ్గి, షేర్ వాల్యూ తగ్గితే వచ్చే ఏడాది పిచాయ్ అందుకునే పారితోషికంలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News