కరోనా ఎఫెక్ట్: భారత్ సాయం కోరిన ట్రంప్
అగ్రరాజ్యం….అత్యాధునిక వైద్య సదుపాయలున్న దేశం… ఇప్పుడు కరోనా వైరస్ వేళ కకావికలమై ఇతర దేశాల సాయం అడిగే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కరోనా టెస్ట్ కిట్స్ కోసం సౌత్ కొరియా సాయం కోరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఇప్పుడు భారత్ ను సాయం కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. భారత్ లో కరోనా ప్రబలుతుండడంతో మలేరియా రోగ నివారణలో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ మందు ఎగుమతులను భారత్ నిలిపివేసింది. భారత్ లో మరీ […]
అగ్రరాజ్యం….అత్యాధునిక వైద్య సదుపాయలున్న దేశం… ఇప్పుడు కరోనా వైరస్ వేళ కకావికలమై ఇతర దేశాల సాయం అడిగే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కరోనా టెస్ట్ కిట్స్ కోసం సౌత్ కొరియా సాయం కోరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఇప్పుడు భారత్ ను సాయం కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు.
భారత్ లో కరోనా ప్రబలుతుండడంతో మలేరియా రోగ నివారణలో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ మందు ఎగుమతులను భారత్ నిలిపివేసింది. భారత్ లో మరీ ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ శివారుల్లోనే ప్రఖ్యాత ఫార్మా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఇప్పుడు దేశ అవసరాలకే ఉత్పత్తిని పెంచాయి.
అయితే ఈ డ్రగ్ ఎగుమతి భారత్ నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడింది. అమెరికాలో కరోనా కేసులు బాగా పెరగడంతో మందు కొరత అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్ ను తమ దేశానికి ఎగుమతి చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత ప్రధాని నరేంద్రమోడీని కోరారు.
తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. డ్రగ్ పంపాల్సిందిగా మోడీని కోరానని.. దీన్ని మన దేశానికి అందజేసే అంశాన్ని ఇండియా తీవ్రంగా పరిశీలిస్తోందని ట్రంప్ తెలిపారు. ఈ డ్రగ్ ఎగుమతిపై భారత్ విధించిన నిషేధం ఎత్తివేయాలని కోరారు. డాక్టర్ల సలహాపై తాము కూడా ఈ మందు వాడుతామని ట్రంప్ తెలిపారు.
ప్రపంచంలోనే ఈ మలేరియా డ్రగ్ ను భారత్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలోనే భారత్ త్వరగా నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని కోరారు.