ఇటలీలో మనవాళ్లు ఎంత దారుణంగా బతుకుతున్నారంటే...!
కరోనా ఇటలీని ఎంత కుదిపేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆ దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని భయం భయంగా బతుకీడుస్తూ.. కనిపించని వైరస్ తో బతుకు పోరాటం చేస్తున్న తెలుగువాళ్ల పరిస్థితులు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లిన మనోళ్ల ఇబ్బందులు మీడియాకు తెలియజేస్తుంటే చాలామంది ఆవేదన చెందుతున్నారు. సాధారణ జ్వరం ఉన్నా కూడా.. చాంతాడంత క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తోందట. మన దగ్గర కంటే కూడా కఠినంగా అక్కడ లాక్ […]
కరోనా ఇటలీని ఎంత కుదిపేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆ దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని భయం భయంగా బతుకీడుస్తూ.. కనిపించని వైరస్ తో బతుకు పోరాటం చేస్తున్న తెలుగువాళ్ల పరిస్థితులు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లిన మనోళ్ల ఇబ్బందులు మీడియాకు తెలియజేస్తుంటే చాలామంది ఆవేదన చెందుతున్నారు. సాధారణ జ్వరం ఉన్నా కూడా.. చాంతాడంత క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తోందట.
మన దగ్గర కంటే కూడా కఠినంగా అక్కడ లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా.. నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు తప్ప.. మరేదీ తెరుచుకోక చాలా కాలమైందని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. కాస్త సంపాదించుకుందామని కష్టపడుతూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నవారి సంగతైతే.. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. పార్ట్ టైమ్ అన్న మాటే లేదని.. ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్న ప్రమాదకర పరిస్థితుల్లో వేతన జీవులంతా ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారన్న మాట వినిపిస్తోంది.
ఇక.. కారణం లేకుండా బయట తిరిగితే 3 వేల యూరోల జరిమానా విధిస్తున్నారక్కడ. ఫలితంగా.. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినా.. అక్కడి పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. మింగలేక.. కక్కలేక.. ఉన్న డబ్బులన్నీ వదిలించుకుని పస్తులుంటున్న వారి సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
భారతదేశానికి తిరిగి వద్దామనుకున్నా కూడా.. అనుకూల పరిస్థితులు లేకుండా పోయాయి. వీసా పునరుద్ధరణ గడువును మే 15 వరకు పొడిగించినా కూడా.. ఎటు వెళ్లాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో.. ఆ అనుమతి అంత సులభంగా అందుకోలేక.. విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారక్కడ.
సరుకులు తెచ్చుకోవాలన్నా వీలు కావడం లేదు. ఓ సారి వెళ్తే… ఏకంగా నెల, రెండు నెలలకు సరిపడా తెచ్చేసుకుంటున్నారు. వాటిని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. తిండికి, నిద్రకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారిలో చాలామంది ఇండియాకు వెళ్లిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. కేంద్రం ఈ విషయంలో స్పందిస్తుందో లేదో చూడాలి.