కరోనా పై జగన్ చర్యలు.... జాతీయ స్థాయిలో చర్చ....

సగం దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రభావం లేదనుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ కరోనా కాస్తగట్టిగానే తాకుతోంది. అందుకే.. ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతమైన నిర్ణయాలతో.. కరోనాను కట్టడి చేయడంలో విజయవంతం అవుతున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్ లుగా ప్రకటించి.. ఆ ఏరియాల నుంచి ఎవరినీ బయట తిరగకుండా కట్టడి చేస్తున్నారు. నిరంతరం పోలీసులు, అధికారులు పహారా కాస్తున్నారు. అలాగే.. సామాజిక దూరాన్ని పాటించని ప్రజల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. వినూత్న చర్యతో […]

Advertisement
Update:2020-03-30 06:32 IST

సగం దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రభావం లేదనుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ కరోనా కాస్తగట్టిగానే తాకుతోంది. అందుకే.. ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతమైన నిర్ణయాలతో.. కరోనాను కట్టడి చేయడంలో విజయవంతం అవుతున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్ లుగా ప్రకటించి.. ఆ ఏరియాల నుంచి ఎవరినీ బయట తిరగకుండా కట్టడి చేస్తున్నారు. నిరంతరం పోలీసులు, అధికారులు పహారా కాస్తున్నారు.

అలాగే.. సామాజిక దూరాన్ని పాటించని ప్రజల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. వినూత్న చర్యతో వారిని కంట్రోల్ చేస్తున్నారు జగన్. ఇంటింటికీ కూరగాయల పంపిణీ చేస్తూ… ఏకంగా రైతు బజార్లనే జనం దగ్గరికి పంపిస్తున్నారు. రద్దీగా ఉన్న మార్కెట్లను మైదానాల్లో, పాఠశాలల్లో ఏర్పాటు చేసి సామాజిక దూరాన్ని పాటింప చేస్తూ జనం అవసరాలు తీరుస్తున్నారు. మరిన్ని మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అంతే కాదు.. ఖైదీలతో ఫేస్ మాస్కులు తయారు చేయిస్తున్న ఫొటోను మంత్రి గౌతమ్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వారిని కూడా మంచి పనిలో భాగం చేస్తూ… జగన్ తన పరిపాలన లోని విశిష్టత చాటుకున్నారు.

అంతే కాదు… సరిహద్దుల్లో ఇరుక్కున్న వారిని రాష్ట్రం లోపలికి అనుమతి ఇస్తామని… అయితే వారు ఖచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ కు సిద్ధపడి రావాలని, పరిస్థితులను అర్థం చేసుకోవాలని…. ప్రజల ఆరోగ్య భద్రతపై తన వైఖరిని స్పష్టం చేసేశారు.

ఇలాంటి వినూత్న చర్యలే.. కరోనా బారి నుంచి ఏపీని కాపాడుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. జాతీయ మీడియాలోనూ ఈ నిర్ణయాలకు సానుకూల స్పందనలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News