మాస్కోపై భారీ డ్రోన్ దాడి
73 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపణ;
Advertisement
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. రష్యా రాజధాని మాస్కోపై భారీ డ్రోన్ దాడి జరింది. సుమారు 73 డ్రోన్‌లతో ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడినట్లు రష్యా ఆరోపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడినారని అధికారులు తెలిపారు. 11 డ్రోన్లను తమ బలగాలు కూల్చివేసినట్లు పేర్కొన్నాయి. మిగతా డ్రోన్లలో కొన్ని క్రాస్నోడార్ ప్రాంతంలో పడటంతో నివాస సముదాయాలు ధ్వంసమైనట్లు చెప్పారు. మరికొన్ని చోట్ల వాహనాలపై పడి మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. మరోవైపు డ్రోన్ దాడిపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement