తెలంగాణలో గ్రూప్-3 ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.;

Advertisement
Update:2025-03-14 15:30 IST

తెలంగాణలో గ్రూప్-3 ఫలితాలు విడుదల అయ్యాయి. జనరల్ ర్యాంకింగ్స్‌తో పాటు మాస్టన్ కీ, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లతో పాటు ఓఎంఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి రాత పరీక్షను నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చిన టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. కాగా, చెప్పినట్లుగానే షెడ్యూలు ప్రకారం ఈనెల 10, 11 తేదీల్లో గ్రూప్‌ 1 ఫలితాలు, గ్రూప్‌-2 రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది.

నేడు టీజీపీఎస్సీ గ్రూప్‌-3 జనరల్‌ ర్యాంకు జాబితా విడుదలైంది. గ్రూప్-3 సర్వీసు పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో రాత పరీక్షలకు 50.24 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అలాగే, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను మార్చి 17న, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు.

Tags:    
Advertisement

Similar News