హోలీ సంబ‌రాల్లో గంజాయి ఐస్‌క్రీమ్స్ విక్రయం

హోలీ వేడుకల్లో గంజాయితో కుల్ఫీ ఐసి క్రీమ్ తయారీ విక్రయం కలకలం రేపింది.;

Advertisement
Update:2025-03-14 17:53 IST

హోలీ వేడుకల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌తో పాటు గంజాయి బాల్స్‌ విక్రయిస్తున్న ముఠాను స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు విభిన్న రీతుల్లో హోలీ సంబరాలు చేసుకుంటారు. లోయర్‌ దూల్‌పేట్‌లోని మల్చిపురాలో కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌, బర్ఫీ స్వీటులో, సిల్వర్‌ కోటెడ్‌ బాల్స్‌లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు జరపుకొన్నారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్టీఎఫ్‌ పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్‌ చేశారు.

100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్‌ కోటెడ్‌ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుల్ఫీ, ఐస్‌ క్రీమ్‌ విక్రయించే సత్యనారాయణ సింగ్‌.. గంజాయితో వీటిని తయారులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి బర్ఫీ, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్ రెడ్డి అభినందించారు.

Tags:    
Advertisement

Similar News