సారీ చెప్పిన సుప్రిత.. ఎందుకంటే?
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానని అందుకే సారీ చెబుతున్నానని ఇన్‌స్టా వేదిక వీడియో విడుదల చేసిన సుప్రిత;
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత తెలుగువారందరికీ సుపరిచితమే. త్వరలోనే ఆమె హీరోయిన్‌గా కూడా పరిచయం కానున్నది. బిగ్‌బాస్ -7 రన్నరప్ అమరదీప్ చౌదరితో కలిసి ఆమె ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. అలాగే పీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తున్నది. అయితే హోలీ సందర్భంగా ఆమె అభిమానులకు విషెస్ చెప్పింది. దీంతో సారీ చెప్పింది. ఆమె సారీ ఎందుకు చెప్పిందంటే...
ఇటీవల కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రిత కూడా తాను తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానని తెలిపింది. ఇక నుంచి అలా చేయడం లేదని.. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొంతమంది తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. వాళ్లలో నేను ఒక దాన్ని. అందుకే ఈ విషయంలో అందరికీ సారీ చెబుతున్నాను. ఎవరైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి వాటిని అనుసరించకండి. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. వారిని సోషల్ మీడియాలో ఫాలో కావొద్దు. అందరికీ థాంక్యూ.. అలాగే మీ అందరికీ మరోసారి సారీ అని వీడియో పోస్టు చేసింది.