యూరో ఫుట్ బాల్ ఆటగాళ్ల వేతనాల్లో కోత

క్వారెంటెయిన్ కేంద్రాలుగా సాకర్ స్టేడియాలు యూరోప్ దేశాలలో అత్యధిక జనాదరణ పొందుతున్న ఫుట్ బాల్ క్రీడకు కరోనా వైరస్ దెబ్బ గట్టిగానే తగిలింది. యూరో ఫుట్ బాల్ కు మరో పేరుగా నిలిచే ఇటలీ, స్పెయిన్ దేశాలలో కరోనా వైరస్ వికట్టహాసం చేస్తోంది. స్పానిష్ లీగ్ కు చిరునామాగా నిలిచే స్పెయిన్ లో …గత 24 గంటల్లోనే కరోనా వైరస్ దెబ్బతో 769 మంది మృతి చెందారు. 56వేల మందికి కరోనా వైరస్ సోకగా.. మొత్తం 4 వేల […]

Advertisement
Update:2020-03-28 02:30 IST
  • క్వారెంటెయిన్ కేంద్రాలుగా సాకర్ స్టేడియాలు

యూరోప్ దేశాలలో అత్యధిక జనాదరణ పొందుతున్న ఫుట్ బాల్ క్రీడకు కరోనా వైరస్ దెబ్బ గట్టిగానే తగిలింది. యూరో ఫుట్ బాల్ కు మరో పేరుగా నిలిచే ఇటలీ, స్పెయిన్ దేశాలలో కరోనా వైరస్ వికట్టహాసం చేస్తోంది.

స్పానిష్ లీగ్ కు చిరునామాగా నిలిచే స్పెయిన్ లో …గత 24 గంటల్లోనే కరోనా వైరస్ దెబ్బతో 769 మంది మృతి చెందారు. 56వేల మందికి కరోనా వైరస్ సోకగా.. మొత్తం 4 వేల 800 మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు…లాక్ డౌన్ లో భాగంగా స్పానిష్ పుట్ బాల్ లీగ్ సైతం స్తంభించిపోయింది. నిన్నటి వరకూ వేలాదిమంది సాకర్ అభిమానులతో కళకళలాడిన స్టేడియాలు కాస్త…కరోనా వైరస్ దెబ్బతో క్వారెంటైన్ కేంద్రాలుగా మారిపోయాయి.

ఫుట్ బాల్ కార్యకలాపాలు నిలిచిపోడంతో…లీగ్ లో పాల్గొనే ప్లేయర్లతో పాటు ఇతర సిబ్బంది వేతనాలలో 70 శాతం కోత విధించాలని బార్సిలోనా, ఇస్పానియోల్, కాటలోనియా ప్రాంతాల క్లబ్ యాజమాన్యాలు నిర్ణయించాయి.

స్పానిష్ క్లబ్ లన్నీ తమతమ స్టేడియాలను..వైద్యపరికాలు ఉంచడానికి, క్వారెంటెయిన్ కేంద్రాలుగా మార్చడానికి వీలుగా ఇప్పటికే ప్రభుత్వానికి అప్పగించాయి.

వైద్యపరికరాల గోడౌన్ గా బెర్న్ బావో…

విశ్వవిఖ్యాత క్లబ్ రియల్ మాడ్రిడ్ కు చెందిన శాంటియాగో బెర్న్ బావో స్టేడియాన్ని…డొనేషన్ల రూపంలో కుప్పలు తెప్పలుగా వస్తున్న కరోనా వైరస్ నిరోధక వైద్యపరికరాలు ఉంచడానికి గోడౌన్ కమ్ స్టోర్ రూమ్ గా ఉపయోగిస్తున్నారు.

స్పెయిన్ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ కు తమ స్టేడియాన్ని ఇప్పటికే అప్పగించినట్లు రియల్ మాడ్రిడ్ క్లబ్ వర్గాలు ప్రకటించాయి.

చికిత్సా కేంద్రాలుగా ఇటలీ స్టేడియాలు

కరోనా వైరస్ తో అతలాకుతలమైన ఇటలీలో జాతీయ ఫుట్ బాల్ శిక్షణ కేంద్రాన్ని…వైరస్ రోగుల చికిత్సా కేంద్రంగా మార్చారు. ఇప్పటి వరకూ ఇటలీలో 75వేలమందికి వైరస్ సోకగా…7 వేల 503 మంది మృత్యువాత పడ్డారు.

తమకు ఫుట్ బాల్ కంటే ప్రజల ప్రాణాలే ప్రధానమని, ఫుట్ బాల్ వేదికలను, శిక్షణ కేంద్రాలను రోగుల చికిత్సా కేంద్రాలుగా మార్చాలని ఇటాలియన్ ఆరోగ్యశాఖకు జాతీయ ఫుట్ బాల్ సంఘం విజ్ఞప్తి చేసింది.

ఇటాలియన్ ఫుట్ బాల్ ప్రధాన కేంద్రంగా ఉన్న టుస్కనీలోనే 3వేలమందికి కరోనా వైరస్ సోకగా 142మంది మృతి చెందారు.

ఆస్ట్ర్రేలియాలో ఉద్యోగాల నుంచి తొలగింపు…

ఆస్ట్ర్రేలియా ఫుట్ బాల్ సంఘం…కరోనా దెబ్బతో తీవ్రనష్టాలకు గురయ్యింది. అంతర్జాతీయ మ్యాచ్ లు, లీగ్ లు రద్దు కావడంతో…ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

ఆస్ట్ర్రేలియాలో ఇప్పటి వరకూ 3 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 100 మంది వైరస్ తో మృత్యువాత పడ్డారు.

ఇంగ్లండ్ లో ఫుడ్ బ్యాంకులు…

కరోనా వైరస్ ను నిరోధించడం కోసం ఇంగ్లండ్ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించడంతో…రోజువారీ ఉద్యోగాలు కోల్పోయినవారికి, పేదలకు ఆహారం అందించడానికి… మాంచెస్టర్ కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ క్లబ్ యాజమాన్యాలు… తమవంతుగా చెరో 50 వేల పౌండ్లు చందగా ఇవ్వడంతో పాటు అభిమానుల నుంచి లక్షా 17వేల డాలర్లను సేకరించి 12వేల ఫుడ్ బ్యాంకులను ఏర్పాటు చేశాయి.

ఆహారం లేక అలమటించిపోతున్నవారికి తోడుగా నిలవడాన్ని మించిన సేవ మరొకటి లేదని మాంచెస్టర్ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News