కరోనా గురించి భయపెట్టే నిజం..!

కరోనా వైరస్ 12 గంటల మాత్రమే బతికి ఉంటుందన్న ప్రచారం అబద్దమేనా.. ? పరిస్థితులు అనుకూలిస్తే ఎన్ని రోజులైనా తన ఉనికిని కరోనా వైరస్ చాటుకుంటుందా… అంటే అమెరికా జరిపిన ఒక పరిశోధనలో నిజమేనని తేలింది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డౌనే సరైన మార్గమని భావించాయి. ఏదైనా ఉపరితలంపై కరోనా వైరస్ 12 గంటల కంటే ఎక్కువ సేపు బతికి ఉండదని ప్రచారం బాగా జరిగింది. జనతా కర్ఫ్యూ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే ప్రచారం […]

Advertisement
Update:2020-03-24 10:40 IST

కరోనా వైరస్ 12 గంటల మాత్రమే బతికి ఉంటుందన్న ప్రచారం అబద్దమేనా.. ? పరిస్థితులు అనుకూలిస్తే ఎన్ని రోజులైనా తన ఉనికిని కరోనా వైరస్ చాటుకుంటుందా… అంటే అమెరికా జరిపిన ఒక పరిశోధనలో నిజమేనని తేలింది.

కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డౌనే సరైన మార్గమని భావించాయి. ఏదైనా ఉపరితలంపై కరోనా వైరస్ 12 గంటల కంటే ఎక్కువ సేపు బతికి ఉండదని ప్రచారం బాగా జరిగింది.

జనతా కర్ఫ్యూ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే ప్రచారం చేసింది. కాని ఈ థియరీ అంతా అబద్దం అనిపించేలా కరోనా వైరస్ 17 రోజుల పాటు బతికి ఉండటం శాస్త్రజ్ఞులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇటీవల కరోనా ప్రారంభ సమయంలో డైమండ్ ప్రిన్సెస్ అనే నౌక జపాన్ లోని యొకహామ రేవు సమీపంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దానిలోని 700 మందికి కరోనా పాజిటీవ్ రావడం ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.

కాగా, 17 రోజుల తర్వాత అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) నౌకలో పరిశీలించగా.. క్రూయిజ్‌లోని క్యాబిన్ లలో కరోనా వైరస్ బతికే ఉండటాన్ని గమనించారు. గత 17 రోజులుగా నిర్మానుష్యంగా ఉండటం బట్టి అది ఎంత మొండి వైరసో తెలుసుకోవాలని పరిశోధకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News