భారత్, ఆఫ్రికాల్లో కరోనా ఎందుకు ప్రభావం చూపడం లేదంటే....
చైనా, ఇటలీ, అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే లాక్ డౌన్ కు ముందు భారత్ సహా వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉంది. మరణాలు అంతగా లేవు. దీనికి కారణమేంటని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆరాతీస్తున్నారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం.. కరోనా వైరస్ భారీ జనాభా ఉన్న చైనాను అతలాకుతలం చేసింది. అయితే వారికే ఎందుకు సోకిందంటే.. వారి జనాభాలో పరిశుభ్రమైన లక్షణాలను అవలంభించరని వాషింగ్టన్ శాస్త్రవేత్తలు, నిపుణుల అధ్యయనంలో […]
చైనా, ఇటలీ, అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే లాక్ డౌన్ కు ముందు భారత్ సహా వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉంది. మరణాలు అంతగా లేవు. దీనికి కారణమేంటని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆరాతీస్తున్నారు.
శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం.. కరోనా వైరస్ భారీ జనాభా ఉన్న చైనాను అతలాకుతలం చేసింది. అయితే వారికే ఎందుకు సోకిందంటే.. వారి జనాభాలో పరిశుభ్రమైన లక్షణాలను అవలంభించరని వాషింగ్టన్ శాస్త్రవేత్తలు, నిపుణుల అధ్యయనంలో తేలింది.
సంప్రదాయ పద్ధతులు కాకుండా ఆహారం, అపరిశుభ్రతే వారికి వైరస్ వ్యాపించడానికి కారణంగా తెలుస్తోంది. చైనా వారు బతికున్న ఎలుకలు, గబ్బిలాలు, పాములు, కప్పలు తినడాన్ని ఇష్టపడుతారు. ఇలాంటి తిండి భారత్ సహా ఆఫ్రికా దేశాల్లో ఉండదు. బాగా ఉడికించిన చికెన్, మటన్, పండ్లు, కూరగాయలు లాంటి వాటినే తింటారు. ఇదే మన రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచింది. ఇప్పుడు చైనాలో సోకినంతంగా భారత్ సహా ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వ్యాపించకపోవడానికి మన ఇమ్యూనిటీ పవర్ కూడా కారణమని తెలుస్తోంది.
ఇక కాలుష్యరహితంగా భారతీయులు, ఆఫ్రికా దేశాల వారు పచ్చని ప్రకృతి మధ్య ఉండడం.. పరిశుభ్రమైన పరిస్థితులు, జీవన స్థితిగతులు, భారతీయుల శరీరాలలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేశాయని వాషింగ్టన్ పరిశోధకులు తేల్చారు. కరోనా కాలంలో ఈ దేశాలను వారి సంప్రదాయమే కాపాడుతోందంటున్నారు.
మొత్తంగా పర్యావరణానికి దగ్గరగా ఉండే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలను ఈ వైరస్ ఏం చేయడం లేదు. అభివృద్ధి పేరుతో విశృంఖలంగా వ్యవహరించిన అభివృద్ధి చెందిన దేశాలను ఈ వైరస్ అతలాకుతలం చేస్తోందని తెలుస్తోంది.