‘లాక్ డౌన్’ అంటే ఏంటో తెలుసా?

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న పేరు. కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. అంతలా ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. చైనాలో కరోనాకు విరుగుడుగా అక్కడి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ చేపట్టింది. ఈ చర్య వల్ల చైనా కొత్తగా కరోనా కేసుల పెరుగుదలను అరికట్టగలిగింది. లాక్‌డౌన్‌ చర్య సత్ఫలితాలిస్తుండటంతో అన్ని దేశాలు ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయి. అసలు లాక్‌డౌన్‌ […]

Advertisement
Update:2020-03-23 15:22 IST

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న పేరు. కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. అంతలా ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది.

చైనాలో కరోనాకు విరుగుడుగా అక్కడి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ చేపట్టింది. ఈ చర్య వల్ల చైనా కొత్తగా కరోనా కేసుల పెరుగుదలను అరికట్టగలిగింది. లాక్‌డౌన్‌ చర్య సత్ఫలితాలిస్తుండటంతో అన్ని దేశాలు ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయి.

అసలు లాక్‌డౌన్‌ అంటే ఏంటీ?

కరోనాకు నివారించేందుకు ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌. భారత్ లో కరోనా తర్వాత ఎక్కువగా విన్పిస్తున్న పేరు లాక్‌డౌన్‌. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలో 75 జిల్లాల్లో లాక్‌డౌన్‌ చేయాలని ఆదేశించారు.

ఇందులో తెలంగాణలోని ఐదు జిల్లాలు, ఏపీలోని మూడు జిల్లాలు ఉన్నాయి. దీంతో ప్రజలు లాక్‌డౌన్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

లాక్‌డౌన్‌ అంటే.. ఓ అత్యవసర నిర్వహణ నియమం (ప్రొటోకాల్). సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడం అని అర్థం. ప్రభుత్వ యంత్రాంగానికి మాత్రమే ఈ ప్రొటోకాల్‌ను ఉపయోగించే అధికారం ఉంటుంది. తమ పరిధిలోని ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఈ ప్రొటోకాల్‌ను ఉపయోగిస్తుంది. భవనాలలో లాక్‌డౌన్‌ అంటే తలుపులకు తాళాలు వేయడం. దీంతో ఏ వ్యక్తి బయటి నుంచి లోపలికి రారు… లోపలి వ్యక్తి బయటకు పోరు. అదేవిధంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ అంటే సాధారణంగా ప్రజలున్న చోటనే ఉండాలి – బయటకు రాకూడదు.

లాక్‌డౌన్ రెండు రకాలుగా ఉంటుంది…

  • నివారణ లాక్‌డౌన్‌ (ప్రివెంటివ్ లాక్‌డౌన్‌)
  • ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌

ప్రివెంటివ్ లాక్‌డౌన్‌ అనగా ప్రజలు, సంస్థల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం. ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌ అనగా అసాధారణమైన పరిస్థితిని పరిష్కరించడానికి అమలు చేసే ముందస్తు చర్య. ప్రాణాలకు తక్షణ ముప్పు లేదా ఇతరత్రా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌ విధిస్తారు.

ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటిల్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తదనుగుణంగా చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించినట్లయితే కరోనా మహమ్మరిని అరికట్టేందుకు వీలుంటుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుత విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలంతా స్వీయనియంత్రణ పాటించాలి. అప్పుడే కరోనా మహమ్మారిని పారద్రోలే వీలుంటుంది.

Tags:    
Advertisement

Similar News