బయట తిరిగితే ఊరుకోం

తెలంగాణలో స్టేజ్ 3 రానివ్వొద్దు ఇండ్లు దాటి బయటకు రాకండి రాష్ట్రంలో 33 కరోనా పాజిటీవ్ కేసులు వైద్యారోగ్య మంత్రి ఈటెల కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించడం పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజు చూపించిన స్పూర్తి ఇవాళ ఏమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల […]

Advertisement
Update:2020-03-23 12:26 IST
  • తెలంగాణలో స్టేజ్ 3 రానివ్వొద్దు
  • ఇండ్లు దాటి బయటకు రాకండి
  • రాష్ట్రంలో 33 కరోనా పాజిటీవ్ కేసులు
  • వైద్యారోగ్య మంత్రి ఈటెల

కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించడం పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజు చూపించిన స్పూర్తి ఇవాళ ఏమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉంటున్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ గడపదాటి బయటకు రావొద్దని చెప్పారు.

కుటుంబసభ్యులు కూడా వారు ఇండ్లు వదలి బయటకు రాకుండా చూడాలని మంత్రి కోరారు. ఎవరైనా బయట తిరిగితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు ఈ నెల 31 వరకు ఇండ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ ప్రకటించగానే కొందరు ఏదో కొంపలు ముగినిపోయినట్లు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారని.. వారికి ప్రాణాలు ముఖ్యమా లేదా ఇతర పనులు ముఖ్యమా అని మంత్రి ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి కఠినమైన చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేశామని.. ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది కూడా విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. సాధారణ ఓపీలు, అత్యవసరం కాని చికిత్సలను రద్దు చేశామని మంత్రి తెలిపారు.

తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటీవ్ సంఖ్య 33కి చేరిందని మరో 97 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఒకటి రెండు రోజుల్లో వారికి సంబంధించిన నివేదికలు కూడా వస్తాయని మంత్రి చెప్పారు.

ప్రస్తుతం 2వ స్టేజీలో ఉన్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం 3వ స్టేజీకి వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. 3వ దశలో పరిస్థితులు మన చేయి దాటిపోయే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు.

అందుకే ప్రజలెవ్వరూ రాత్రి 7 గంటల తర్వాత బయటకి రావొద్దని.. కిరాణా షాపులు కూడా ఆ సమయానికి బంద్ చేయాలని మంత్రి చెప్పారు. ఉదయం 6 తర్వాత అత్యవసరం అయితే తప్ప బయట తిరొగొద్దని.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News