గల్లా పార్టీ మారుతున్నాడా?
మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. అంటూ లోక్ సభలో ప్రధాని మోదీని నిలదీసి జాతీయ దృష్టిని ఆకర్షించిన నాయకుడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి మంత్రిగానూ పని చేసిన గల్లా అరుణకుమారి రాజకీయ వారసుడిగా వచ్చిన జయదేవ్.. టీడీపీ తరఫున ఎంపీ అయ్యాడు.. లోక్ సభలో పార్టీ వాణిని, రాష్ట్ర సమస్యలను కాస్త గట్టిగానే వినిపిస్తున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్లూ వీలైనంతగా పోరాడారు. అలాంటి జయదేవ్.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడి… […]
మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. అంటూ లోక్ సభలో ప్రధాని మోదీని నిలదీసి జాతీయ దృష్టిని ఆకర్షించిన నాయకుడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి మంత్రిగానూ పని చేసిన గల్లా అరుణకుమారి రాజకీయ వారసుడిగా వచ్చిన జయదేవ్.. టీడీపీ తరఫున ఎంపీ అయ్యాడు.. లోక్ సభలో పార్టీ వాణిని, రాష్ట్ర సమస్యలను కాస్త గట్టిగానే వినిపిస్తున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్లూ వీలైనంతగా పోరాడారు.
అలాంటి జయదేవ్.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడి… కేశినేని నాని వంటి సీనియర్లకూ పార్టీలో ప్రాధాన్యత తగ్గేలా ప్రభావం చూపి… గుంటూరు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా మారిన జయదేవ్.. ఇప్పుడు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్తే.. తెలుగు తమ్ముళ్లలో హల్ చల్ చేస్తోంది. ఇందుకు కారణాలు ఏమై ఉంటాయా.. అన్న చర్చ జరుగుతోంది.
ఒకవేళ గల్లా జయదేవ్ పార్టీ మారడం నిజమే అయితే.. ఏ గూటికి చేరతారన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒకనాటి తోటి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ మాదిరిగా బీజేపీ గూటికి వెళ్తారా.. లేదంటే తన పార్టీ నేతల్లా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరతారా.. అన్నది చర్చనీయాంశమైంది. గల్లా జయదేవ్ కు వ్యాపారాలు పెద్ద మొత్తంలోనే ఉన్నాయి కాబట్టి.. రాజకీయాలను వదిలే అవకాశమైతే లేదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు.. గల్లా పార్టీ మారతారో లేదో తెలియదు కానీ.. ఈ గుసగుసలు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు కుర్చీ కింద కూసాలు కదిలేలా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
గతంలో.. ఆయన ఇలాగే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను బలవంతంగా తన పార్టీలో చేర్చుకున్న నాటి సందర్భం ఆయనకు కచ్చితంగా గుర్తుకు వచ్చి తీరుతుందనడంలోనూ ఎలాంటి అనుమానమూ అక్కర్లేదు.