కట్, కాపీ, పేస్ట్ సృష్టికర్త కన్నుమూత..!

ఆయన బిల్‌గేట్స్‌లా బిలియనీర్ కాదు.. స్టీవ్ జాబ్స్‌లా పాపులర్ కాదు.. కాని ఆయన సృష్టించిన సాంకేతికతను ఉపయోగించని వాళ్లు ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. కంప్యూటర్లు, ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్లలో డాక్యుమెంట్ల రూపకల్పనకు ఉపయోగించే కట్, కాపీ, పేస్ట్ సాంకేతికతను సృష్టించిన అతని పేరే లారీ టెస్లర్. 1945లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన 74 ఏళ్ల వయసులో సోమవారం కన్నుమూశారు. 1970లో ఆయన జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో పని చేసే సమయంలో ఆయన కట్, కాపీ, […]

Advertisement
Update:2020-02-20 10:17 IST

ఆయన బిల్‌గేట్స్‌లా బిలియనీర్ కాదు.. స్టీవ్ జాబ్స్‌లా పాపులర్ కాదు.. కాని ఆయన సృష్టించిన సాంకేతికతను ఉపయోగించని వాళ్లు ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. కంప్యూటర్లు, ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్లలో డాక్యుమెంట్ల రూపకల్పనకు ఉపయోగించే కట్, కాపీ, పేస్ట్ సాంకేతికతను సృష్టించిన అతని పేరే లారీ టెస్లర్. 1945లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన 74 ఏళ్ల వయసులో సోమవారం కన్నుమూశారు.

1970లో ఆయన జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో పని చేసే సమయంలో ఆయన కట్, కాపీ, పేస్ట్‌ను అభివృద్ధి చేశారు. అప్పట్లో ముద్రించిన డాక్యుమెంట్లను కత్తిరించి.. పలు చోట్ల అతికించి వేరే డాక్యుమెంట్లు రూపొందించే వాళ్లు. దీన్ని స్పూర్తిగా తీసుకున్న ఆయన కట్, కాపీ, పేస్ట్‌ను కనుగొన్నారు. మొదట్లో ఆయన సృష్టించిన సాంకేతికతకు పెద్దగా గుర్తింపు రాలేదు. కాని ఆపిల్ సంస్థ ఈ సాంకేతికతను తమ లీసా కంప్యూటర్లలో ఉపయోగించడంతో బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఆయన ఆపిల్ సంస్థలో ఉద్యోగిగా 20 ఏండ్లు పని చేశారు.

టెస్లర్ కేవలం కట్, కాపీ, పేస్ట్‌తో ఆగిపోలేదు. లీసా, మాకిన్‌తోష్, న్యూటన్‌కు సంబంధించి ఐఫోన్లలో ఉపయోగించే యూజర్ ఇంటర్ ఫేస్‌ల అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఇప్పుడు మనం విస్తృతంగా వాడుతున్న ‘బ్రౌజర్’ అనే పదాన్ని ఆయన సూచించినదే. ఇలా టెక్ ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆయన మూల కారకుడిగా ఉన్నారు. కాని ఆయన జీవించినంత కాలం లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేశారు. టెస్లర్ మృతి పట్ల సామాజిక మాధ్యమాల్లో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News