ఇక వరుసగా ఎన్నికలే.... సిద్ధంగా ఉండండి!
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పురపాలక, స్థానిక సంస్థల, రైతు సహకార, నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న ప్రకారం మార్చి 15 లోపే.. అంటే కేవలం నెల రోజుల్లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఆ తర్వాత.. మే, జూన్ లో సహకార, నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం ఆలోచిస్తున్నారు. ఈ […]
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పురపాలక, స్థానిక సంస్థల, రైతు సహకార, నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న ప్రకారం మార్చి 15 లోపే.. అంటే కేవలం నెల రోజుల్లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఆ తర్వాత.. మే, జూన్ లో సహకార, నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన అమలైతే మాత్రం.. రాష్ట్రంలో రాజకీయాలు మరింతగా వేడెక్కనున్నాయి. ఏకంగా మూడున్నర నెలల పాటు వరుసగా ఎన్నికల వాతావరణం.. వేసవిని మించి వేడెక్కనుంది.
ఇప్పటికే.. ప్రభుత్వ కీలక విధానాలు, పరిపాలన సంస్కరణలపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఈ వాగ్వాదం మరింత పెరిగేలాగే కనిపిస్తోంది. ఇటు ప్రభుత్వం తన విధానాలను జనానికి వివరించడంతో పాటు… సంక్షేమ పథకాల అమలు తీరును చెప్పేందుకు ఈ ఎన్నికల ప్రచారాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఫలితంగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తితో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది.
విపక్షాల విమర్శలకు తగిన సమాధానం చెప్పేందుకు.. ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.