లెక్క మొదలైంది.... తరలింపు కసరత్తు జరుగుతోంది

మూడు రాజధానులపై అడుగు ముందుకు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిబ్బంది కేటాయింపులోనూ వేగంగా అడుగులు వేస్తోంది. న్యాయ రాజధానిగా ఏర్పాటు కాబోతున్న కర్నూలుకు ఎంత మందిని తరలించాలి.. సిబ్బంది కేటాయింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. న్యాయ విభాగం పరిధిలో ఉండే శాఖలు.. కార్యాలయాలు.. వాటి సిబ్బంది వివరాలపై.. సచివాలయ ఉద్యోగుల సంఘంలోనూ చర్చ జరుగుతోంది. ఎవరెవరు.. అమరావతి నుంచి తరలివెళ్లేందుకు సుముఖంగా ఉన్నారన్న విషయంపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. […]

Advertisement
Update:2020-02-10 09:47 IST

మూడు రాజధానులపై అడుగు ముందుకు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిబ్బంది కేటాయింపులోనూ వేగంగా అడుగులు వేస్తోంది. న్యాయ రాజధానిగా ఏర్పాటు కాబోతున్న కర్నూలుకు ఎంత మందిని తరలించాలి.. సిబ్బంది కేటాయింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. న్యాయ విభాగం పరిధిలో ఉండే శాఖలు.. కార్యాలయాలు.. వాటి సిబ్బంది వివరాలపై.. సచివాలయ ఉద్యోగుల సంఘంలోనూ చర్చ జరుగుతోంది.

ఎవరెవరు.. అమరావతి నుంచి తరలివెళ్లేందుకు సుముఖంగా ఉన్నారన్న విషయంపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. విజిలెన్స్ విభాగాన్ని సచివాలం నుంచి వేరు చేసి కర్నూలుకు తరలించే అంశంపైనా చర్చ నడుస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్ కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యోగులు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక.. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానికి సిబ్బంది ఎందరు అవసరం, క్వార్టర్లు ఎన్ని అవసరం, ఏయే సిబ్బందికి క్వార్టర్లు కేటాయించాలి.. వాటికి అనువైన భవనాలు ఎక్కడ ఉన్నాయి.. అన్నది కూడా విస్తృత పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ కార్యాచరణ పూర్తయితే.. మూడు రాజధానుల నుంచి పరిపాలనను కొనసాగించవచ్చని సీఎం జగన్ భావిస్తున్నారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News