పరిపాలన వికేంద్రీకరణకు పెరుగుతున్న మద్దతు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన పరిపాలన వికేంద్రీకరణకు.. మద్దతు పెరుగుతోంది. అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు కొందరు, కొన్ని జిల్లాల్లోని కొందరు టీడీపీ నేతలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని కాపాడుకుంటామని సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు.. అక్కడా ఇక్కడా అని కాకుండా అన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు కూడా వికేంద్రీకరణకు మద్దతుగా తమ గొంతుక వినిపిస్తూ.. ప్రదర్శనలు చేస్తున్నారు. వీరికి తోడుగా.. మేధావులూ, లాయర్లు, కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు […]

Advertisement
Update:2020-02-10 06:50 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన పరిపాలన వికేంద్రీకరణకు.. మద్దతు పెరుగుతోంది. అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు కొందరు, కొన్ని జిల్లాల్లోని కొందరు టీడీపీ నేతలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని కాపాడుకుంటామని సవాళ్లు విసురుతున్నారు.

మరోవైపు.. అక్కడా ఇక్కడా అని కాకుండా అన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు కూడా వికేంద్రీకరణకు మద్దతుగా తమ గొంతుక వినిపిస్తూ.. ప్రదర్శనలు చేస్తున్నారు. వీరికి తోడుగా.. మేధావులూ, లాయర్లు, కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు కూడా వికేంద్రీకరణకే తమ ఓటు అని మద్ధతు పలుకుతున్నారు.

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి చోట.. రాజనీతి శాస్త్ర విభాగ సమావేశ మందిరంలో.. ఓ సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి నేతలు, మేధావులు, పలువురు విద్యార్థులు హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అమరావతి నుంచి ఏక కేంద్రంగా పరిపాలన జరుగుతోందని.. ఈ కారణంగానే రాయలసీమకు రావాల్సిన వెయ్యి పడకల ఆసుపత్రి అమరావతికి తరలిందని ఆరోపించారు.

ఎన్జీవో సంఘం నేతలు మాట్లాడుతూ…. రాష్ట్రంలో 7 జిల్లాలు వెనకబడినట్టుగా కేంద్రం గుర్తించిందని.. ఇవి అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానుల ఏర్పాటు మంచి నిర్ణయమని సమర్థించారు. అంబేడ్కర్ వర్సిటీ మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్ కూడా.. ఇదే నిర్ణయానికి మద్దతిచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ జరగకపోతే.. మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమం ఖాయమని కుండ బద్ధలు కొట్టారు.

జన చైతన్య వేదిక నాయకులు మాట్లాడుతూ…. అమరావతిలో రియల్ ఎస్టేట్ దందా జరిగిందని ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిందే అని చెప్పారు. ఇలాంటి పరిస్థితి మారాలంటే.. మూడు రాజధానులు రావాలని.. అభివృద్ధిని విస్తరించాలని.. అప్పుడే ప్రజల జీవితాలు బాగుపడతాయని మేధావులు చెబుతున్నారు. రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News