అయ్యో అంబానీ... ఇంతలా దిగజారిపోతివేమి..!

ఒకప్పుడు టాటాలు బిర్లాల గురించి చెప్పుకొనేవాళ్లు. తర్వాత రాను రాను అంబానీల శకం మొదలైంది. ధీరూభాయ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. విశ్వవ్యాప్తమైంది. ఆయన గతించిన తర్వాత పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ…. సంస్థను మరింత ఉన్నతంగా ముందుకు తీసుకుపోతుంటే…. ఇటు చిన్న కుమారుడు అనిల్ అంబానీ మాత్రం రోజు రోజుకూ దిగజారిపోతున్నాడు. ముఖేష్ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా విజయం సాధిస్తుంటే.. అనిల్ మాత్రం ఏం చేసినా పరాజయాన్ని ఎదుర్కొంటున్నాడు. గతంలో తన సంస్థల నిర్వహణ, విస్తరణ […]

Advertisement
Update:2020-02-08 05:14 IST

ఒకప్పుడు టాటాలు బిర్లాల గురించి చెప్పుకొనేవాళ్లు. తర్వాత రాను రాను అంబానీల శకం మొదలైంది. ధీరూభాయ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. విశ్వవ్యాప్తమైంది. ఆయన గతించిన తర్వాత పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ…. సంస్థను మరింత ఉన్నతంగా ముందుకు తీసుకుపోతుంటే…. ఇటు చిన్న కుమారుడు అనిల్ అంబానీ మాత్రం రోజు రోజుకూ దిగజారిపోతున్నాడు.

ముఖేష్ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా విజయం సాధిస్తుంటే.. అనిల్ మాత్రం ఏం చేసినా పరాజయాన్ని ఎదుర్కొంటున్నాడు. గతంలో తన సంస్థల నిర్వహణ, విస్తరణ కోసం అనిల్ అంబానీ.. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాకు సంబంధించిన ముంబై శాఖ నుంచి.. చైనా డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి.. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి భారీ రుణమే తీసుకున్నారు.

ఈ రుణం విలువ దాదాదపు 6 వేల 750 కోట్ల రూపాయలు. ఇది తీసుకున్నప్పుడు అనిల్ వ్యక్తిగత పూచికత్తు పాటించలేదని ఆరోపిస్తూ… ఆ మూడు బ్యాంకులు బ్రిటన్ లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

ఈ సందర్భంగా.. అనిల్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ నికర ఆస్తి విలువ సున్నా.. అని చెప్పి ఆశ్చర్యపరిచారు. అంటే.. ఒక్క రూపాయి కూడా అనిల్ దగ్గర లేదని స్పష్టం చేశారు.

ఈ మాటలు నమ్మని కోర్టు.. అనిల్ కు ఇప్పటికీ ఉన్న విలాసవంతమైన భవనాలు, కార్లు, విల్లాల సంగతి చెప్పి ఆశ్చర్యపరిచింది. 6 వారాల్లోగా ఆ మూడు బ్యాంకులకు 700 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. చేసేదేమీ లేక.. పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అనిల్ అంబానీ నిర్ణయించారు.

Tags:    
Advertisement

Similar News