అమరావ‌తి భూముల కొనుగోళ్ల‌పై ఐటీ గురి !

అమ‌రావ‌తి భూముల కొనుగోళ్ల లావాదేవీల‌పై ఐటీ శాఖ ఆరాతీస్తోంది. ఈమేర‌కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ ఐటీ చీఫ్ కమీషనర్ కు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఐటీ రంగంలోకి దిగే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. సీఐడీ లేఖతో పాటు 106 మంది… 2018 నుండి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని […]

Advertisement
Update:2020-02-08 04:12 IST

అమ‌రావ‌తి భూముల కొనుగోళ్ల లావాదేవీల‌పై ఐటీ శాఖ ఆరాతీస్తోంది. ఈమేర‌కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ ఐటీ చీఫ్ కమీషనర్ కు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఐటీ రంగంలోకి దిగే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. సీఐడీ లేఖతో పాటు 106 మంది… 2018 నుండి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని సూచించారు. 2 లక్షలకు మించి జరిగిన అనుమానిత‌ ట్రాన్సెక్షన్ లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సిఐడి అధికారులు లేఖ‌లో పేర్కొన్నారు. లేఖతో పాటు ఎక్సెల్ షీట్లో 106 మంది అసైన్డ్‌ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల పూర్తి వివరాలు, అడ్రస్ లు, సర్వే నెంబర్లతో సహా ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సీఐడీ పంపించింది.

ఏపీ సిఐడి విజ్ఞప్తితో 2018-2019 మధ్య అసైన్డ్‌ భూముల కొనుగోలులో జరిగిన లావాదేవీలను ఐటీ అధికారులు పంపించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు ఈ కొనుగోళ్ల పూర్తి వివ‌రాలు సేక‌రించిన త‌ర్వాత దాడులు జ‌రిగే అవ‌కాశం క‌న్పిస్తోంది.

Tags:    
Advertisement

Similar News