నెలాఖరుకు కొత్త సీనియర్ సెలెక్టర్లు

ముగియనున్నఎమ్మెస్కే పదవీకాలం బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు సెలెక్టర్ల స్థానాల ఖాళీలను ఈ నెలాఖరుకు భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు. సౌత్ జోన్ కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్, వెస్ట్ జోన్ కు చెందిన గగన్ ఖోడాల పదవీకాలం కొద్దివారాల క్రితమే ముగిసినా…కొత్త సెలెక్టర్ల నియామకం వరకూ.. ఈ ఇద్దరూ కొనసాగుతున్నారు. అయితే… ఐదుగురు సభ్యుల ఎంపిక సంఘంలో ఏర్పడిన రెండుస్థానాల భర్తీ కోసం ఈ మధ్యనే బీసీసీఐ… దరఖాస్తులు ఆహ్వానించింది. సౌత్ […]

Advertisement
Update:2020-02-04 05:46 IST
  • ముగియనున్నఎమ్మెస్కే పదవీకాలం

బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు సెలెక్టర్ల స్థానాల ఖాళీలను ఈ నెలాఖరుకు భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు.

సౌత్ జోన్ కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్, వెస్ట్ జోన్ కు చెందిన గగన్ ఖోడాల పదవీకాలం కొద్దివారాల క్రితమే ముగిసినా…కొత్త సెలెక్టర్ల నియామకం వరకూ.. ఈ ఇద్దరూ కొనసాగుతున్నారు.

అయితే… ఐదుగురు సభ్యుల ఎంపిక సంఘంలో ఏర్పడిన రెండుస్థానాల భర్తీ కోసం ఈ మధ్యనే బీసీసీఐ… దరఖాస్తులు ఆహ్వానించింది.

సౌత్ జోన్ స్థానానికి విఖ్యాత కామెంటీటర్ ఎల్. శివరామకృష్ణన్, వెస్ట్ జోన్ స్థానం నుంచి మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్, అమేయా ఖురాసియా, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ నయన్ మోంగియాతో సహా పలువురు దరఖాస్తు చేసుకొన్నారు.

కొత్త సలహా మండలి…

బీసీసీఐ సెలెక్టర్లను ఎంపిక చేయటానికి…ముగ్గురు సభ్యుల సలహామండలిని ఈ మధ్యనే ఎంపిక చేశారు. మదన్ లాల్, సులక్షణ కులకర్ణీ, రుద్రప్రతాప్ సింగ్ లతో కూడిన కొత్త సలహా మండలి…ఖరారు చేయనుంది.

ఐదుగురు సభ్యుల బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ కు ఏడాదికి కోటిరూపాయలు, మిగిలిన సెలెక్టర్లకు అనుభవాన్ని బట్టి 60 లక్షల నుంచి 80 లక్షల రూపాయల వరకూ వేతనంగా చెల్లిస్తున్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెస్కే ప్రసాద్ స్థానాన్ని శివరామకృష్ణన్ భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనపిస్తున్నాయి.

సెలెక్షన్ కమిటీ మిగిలిన ముగురు సభ్యుల్లో శరణ్ దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ, జతిన్ పరంజపే…నార్త్, ఈస్ట్, సెంట్రల్ జోన్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News