ఎమ్మెల్సీలు మొహం చాటేశారా? అయితే మండలిలో ఎలా?
అమరావతిని ఎలాగైనా రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలను రోజు రోజుకూ విస్తృతం చేస్తున్న తెలుగుదేశం శ్రేణులకు ఊహించని పరిణామం ఇది. ఇన్నాళ్లూ.. తమకు శాసనమండలి అండగా ఉంటుందని.. తమ బలం అక్కడ పని చేస్తుందని టీడీపీ భావిస్తూ వచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదనపై బిల్లు సభల ముందుకు వస్తే.. శాసనసభలో వైసీపీ బలం ముందు తాము నిలబడలేకున్నా.. మండలిలో మాత్రం అడ్డుకుని తీరుతామని.. బిల్లును చట్టంగా మారకుండా చూస్తామని చెబుతూ వచ్చింది. తెలుగుదేశం పెట్టుకున్న ఆశలు […]
అమరావతిని ఎలాగైనా రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలను రోజు రోజుకూ విస్తృతం చేస్తున్న తెలుగుదేశం శ్రేణులకు ఊహించని పరిణామం ఇది. ఇన్నాళ్లూ.. తమకు శాసనమండలి అండగా ఉంటుందని.. తమ బలం అక్కడ పని చేస్తుందని టీడీపీ భావిస్తూ వచ్చింది.
మూడు రాజధానుల ప్రతిపాదనపై బిల్లు సభల ముందుకు వస్తే.. శాసనసభలో వైసీపీ బలం ముందు తాము నిలబడలేకున్నా.. మండలిలో మాత్రం అడ్డుకుని తీరుతామని.. బిల్లును చట్టంగా మారకుండా చూస్తామని చెబుతూ వచ్చింది.
తెలుగుదేశం పెట్టుకున్న ఆశలు మండలిలో ఫలించేలా లేవని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి ఏకంగా 10 మంది ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారని తెలుస్తోంది. ఈ వార్త బయటికి వస్తే.. తమ పరువు పోతుందేమో అన్న ఆందోళనతో.. తెలుగుదేశం నేతలు సమాచారాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది.
కానీ… తెలుగుదేశంలోని నేతలే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్న రోజులివి. అలాంటప్పుడు ఈ విషయం బయటికి రాకుండా ఎందుకు ఉంటుంది? ఆ నోటా.. ఈ నోటా విషయం బయటికి వచ్చేంది. ఇప్పటికే శాసనసభలో ఉన్న కాస్త ఎమ్మెల్యేల్లో కొందరు బాబుకి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇప్పుడు మండలి వంతు వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మూడు రాజధానులను మండలిలో అడ్డుకోవడం ఎలా అన్న అంతర్మథనం టీడీపీలో జోరుగా కొనసాగుతోంది.
వైసీపీ నాయకత్వం వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేయాలన్న సంకల్పం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే.. ఏం చేసైనా.. మండలిలో తమ బలాన్ని చూపించి.. అమరావతిని రాజకీయంగా వాడుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచాలని తెలుగు దేశం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఎవరు తమ వెంట నడిచినా నడవకున్నా.. పోరాటాన్ని మాత్రం సజీవంగా ఉంచడమే కాన్సెప్ట్ గా ప్రయత్నాలు చేస్తున్నారట.
అమరావతే లేకుంటే.. తమకు మాట్లాడ్డానికి వేరే టాపిక్కే లేదా అన్నంతగా.. తెలుగుదేశం నాయకులు పరితపిస్తున్నారనడానికి.. ఈ ఉదాహరణ చాలదా. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడికి ఈ సమస్యలు ఏంటో.. అనుకుంటున్నారంతా.